ఈగల్ కి వీలైనంత సోలో రిలీజ్ దక్కాలని ఫిలిం ఛాంబర్ చేసిన ప్రకటన, ప్రయత్నాలు చివరికి ఏ మలుపు తీసుకుంటాయో అంతు చిక్కడం లేదు. యాత్ర 2 ఫిబ్రవరి 8నే వస్తోంది. ఊరి పేరు భైరవకోన నుంచి ఎలాంటి వాయిదా ప్రకటన రాలేదు కాబట్టి సాంకేతికంగా బరిలో ఉన్నట్టే. నిర్మాత అనిల్ సుంకర నుంచి ధృవీకరణ వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఒకవేళ తగ్గనంటే ఎవరు మాత్రం చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు రజనీకాంత్ లాల్ సలామ్ ఫిబ్రవరి 9నే విడుదల కాబోతున్నట్టు చెప్పేసింది. పేరుకి క్యామియోనే అన్నారు తలైవాకి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కిందని చెన్నై టాక్.
లాల్ సలామ్ తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకుంటుంది. రజని మార్కెట్ దృష్ట్యా ఈగల్ కోసం లేట్ వద్దామని అనుకోకపోవచ్చు. పైగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం కాబట్టి ఇక్కడి బడా డిస్ట్రిబ్యూటర్ల మద్దతు బలంగా ఉంటుంది. 2.0 నుంచి పొన్నియిన్ సెల్వన్ దాకా ఇక్కడి నెట్ వర్క్ ని ఉపయోగించుకునే మంచి థియేటర్లలో వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి సహజంగానే లాల్ సలామ్ కోసం అవసరమైన స్క్రీన్లు దొరికే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. అయితే పోటీ పరంగా రవితేజకి మరీ థ్రెట్ అనిపించే సినిమాలైతే ఇవేవి కాదు. చివరిగా మెప్పించాల్సింది కంటెంటే.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లాల్ సలామ్ కు ఏ మాత్రం బజ్ వచ్చినా ఆ క్రెడిట్ జైలర్ కే వెళ్తుంది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. క్యాస్టింగ్, సాంకేతిక వర్గం పరంగా రిచ్ గా ఉన్న లాల్ సలామ్ మీద ఇప్పటికైతే పెద్దగా బజ్ లేదు కానీ ప్రమోషన్లు మొదలుపెట్టాక అంచనాలు పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈగల్ కి బెస్ట్ ఓపెనింగ్ వస్తుందని ఎదురు చూస్తున్న మాస్ మహారాజా అభిమానులకు ఇదంతా షాకే. మరి లాల్ సలామ్ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 9కే లాక్ అవుతుందా లేదా చూడాలి.
This post was last modified on January 9, 2024 9:56 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…