జనవరి 12 గుంటూరు కారంతో ఒకే రోజు తలపడటం వల్ల థియేటర్ల సమస్యతో పాటు అధిక శాతం ప్రేక్షకులకు చేరుకోలేమని గుర్తించిన హనుమాన్ ముందు రోజు సాయంత్రం ప్రీమియర్లకు పచ్చ జెండా ఊపేసింది. ఈ వార్త నాలుగైదు రోజుల క్రితమే వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఎట్టకేలకు బుకింగ్స్ మొదలైపోయాయి. మొదటి షో హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో గురువారం సాయంత్రం 6.15 నిమిషాలకు మొదలుకానుంది. అక్కడి నుంచి అన్ని ప్రధాన కేంద్రాల్లో రాత్రి పది గంటల లోపు సమయానుకూలంగా ప్రదర్శనలు వేయబోతున్నారు.
ఇప్పటిదాకా అమలాపురం, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, ఏలూరు సంబంధించిన బుకింగ్స్ పెట్టేయగా గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ కి దగ్గరగా ఉన్నాయి. హనుమాన్ నిర్మాతల ఆలోచన ఈ రకంగా మంచి ఫలితాన్నే ఇస్తోంది. గుంటూరు కారం చూశాక మళ్ళీ ఇంకో సినిమాకు వెళ్లేందుకు టైం లేని మూవీ లవర్స్ హ్యాపీగా ఇప్పుడు ముందు రోజు సాయంత్రమే హనుమాన్ చూసేస్తారు. దానికి తోడు టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్న స్థాయిలో కంటెంట్ ఉంటే మాత్రం ఆ పాజిటివ్ టాక్ ఎలాగూ సోషల్ మీడియా ద్వారా వెంటనే, ఆపై ఉదయం రివ్యూల రూపంలో వచ్చేస్తుంది.
హీరో ఇమేజ్ కన్నా హనుమంతుడి బ్రాండ్ మీద బుకింగ్స్ జరుగుతున్న హనుమాన్ ప్రమోషన్ల కోసం ప్రశాంత్ వర్మ టీమ్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ చుట్టేస్తోంది. పబ్లిసిటీ విషయంలో దూకుడు చూపిస్తున్న తీరు ఓపెనింగ్స్ కి దోహదపడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడం కొంత మైలేజ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. సరిగ్గా పది రోజుల వ్యవధిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ సినిమాకు పని చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మహేష్ మాస్ కన్నా ముందు తేజ సజ్జ హీరోయిజం రిపోర్ట్స్ ముందే వచ్చేస్తాయన్న మాట.
This post was last modified on January 9, 2024 12:19 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…