ఈ సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా పోటీలో నిలిచింది హనుమాన్ అనే చిన్న సినిమా. అయితే కాస్టింగ్, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే కానీ.. అవుట్ ఫుట్ విషయంలో.. బిజినెస్ పరంగా.. ముఖ్యంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇది పెద్ద సినిమాలకు దీటుగా నిలిచేదే.
కాకపోతే ఈ సినిమాకు.. సంక్రాంతి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలినన్ని స్క్రీన్లు దక్కకపోవడం సమస్యగా మారింది. దీనివల్ల ఓపెనింగ్స్ మీద గట్టిగానే ప్రభావం పడనుంది. వేరే సినిమాలకు టాక్ తేడా కొట్టి ఈ సినిమాకు టాక్ బాగుంటే పరిస్థితి మారొచ్చు. లేదంటే మాత్రం ఇబ్బంది తప్పదు.
అయితే హనుమాన్ కు తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం మంచి స్కోప్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కేజీఎఫ్, పుష్ప, కార్తికేయ 2 తరహాలో ఈ సినిమా సంచలనం సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పైన చెప్పుకున్న చిత్రాలన్నీ కూడా పెద్దగా అంచనాలు లేకుండా ఉత్తరాదిన రిలీజ్ అయినవి. కానీ ఉత్తరాది ప్రేక్షకులకు ఆ సినిమాలు తెగ నచ్చేశాయి.
వాటికి అన్నీ కలిసి వచ్చి ఊహించని విజయాన్ని అందుకున్నాయి. హనుమాన్ హనుమంతుడి చుట్టూ తిరిగే కథ కావడం.. ఇందులోని సూపర్ నేచురల్ అంశాలు యూనివర్సల్ కావడం పెద్ద ప్లస్. ముఖ్యంగా ఉత్తరాదిన రామ మందిరం తాలూకు హడావిడి నడుస్తున్న నేపథ్యంలో సినిమా బాగుంటే దీనికి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉన్నాయి.
నార్త్ ఇండియాలో దీనికి పెద్దగా పోటీ కూడా లేదు. ప్రేక్షకులు దీని వైపు చూస్తే బోలెడన్ని స్క్రీన్లు లభిస్తాయి. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్లు, షోలు తగ్గాయి అని బాధపడాల్సిన పని కూడా ఉండదు. చిత్ర బృందం ఊహించని స్థాయిలో రెవెన్యూ రావచ్చు.
This post was last modified on January 9, 2024 10:25 am
ఇండియన్ హిస్టరిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం జరుపుకున్న రామాయణ పార్ట్ 1 ఇంకో పది రోజుల్లో విడుదల…
ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…
ఏపీలో జరుగుతున్న స్థానిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర…
ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీలకంగా భావించే ఈ స్థానం..…
నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…