ప్రస్తుత జనరేషన్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న దర్శకుడు ఎవరు అంటే.. మరో మాట లేకుండా క్రిస్టఫర్ నోలన్ పేరు చెప్పవచ్చు ఏమో. బ్యాట్మన్ సిరీస్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ , డన్ కిర్క్ లాంటి చిత్రాలతో నోలన్ మామూలుగా ఫాలోయింగ్ సంపాదించలేదు. ఇండియాలో నోలన్ వీరాభిమానులు భారీగానే ఉన్నారు. అతడి కొత్త సినిమా వస్తుందంటే వీకెండ్ మొత్తం ఫుల్స్ పడిపోతాయి.
గత ఏడాది నోలన్ కొత్త చిత్రం ఓపెన్ హైమర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులు ఊహించుకున్నట్లుగా విజువల్ వండర్ కాకపోయినా.. నోలన్ గత చిత్రాలకు భిన్నంగా సీరియస్ డ్రామాలా సాగినా బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ఓపెన్ హైమర్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా అవార్డులు పంట పండించుకోవడం ఖాయం అన్న చర్చ జరిగింది. ఇప్పుడు ఆ అంచనానే నిజం అవుతోంది.
ఆస్కార్ అవార్డుల తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ లో ఓపెన్ హైమర్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 2023 సంవత్సరానికి ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఓపెన్ హైమర్ పాత్రలో అద్భుత అభినయం ప్రదర్శించిన సిలియన్ మర్ఫీ అనుకున్నట్లే ఉత్తమ నటుడుగా ఎంపిక అయ్యాడు. ఉత్తమ దర్శకుడు పురస్కారం క్రిస్టఫర్ నోలన్ ను దాటి పోలేదు.
ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఎవ్వరూ ఊహించని మేకోవర్, గ్రేట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఐరన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపిక అయ్యాడు. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) , ఉత్తమ చిత్రం కేటగిరిల్లో కూడా ఓపెన్ హైమర్‌కు అవార్డులు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో పైచేయి సాధించడం చూశాక.. త్వరలో జరిగే ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆధిపత్యం చలాయించడం ఖాయంగా కనిపిస్తోంది. అకాడమీ అవార్డుల వేడుక వచ్చే నెల చివర్లో జరగనుంది.
This post was last modified on January 8, 2024 10:41 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…