Movie News

ఎప్పుడూ చూడని దిల్ రాజు ఆగ్రహం

మాములుగా ఎలాంటి సందర్భంలో అయినా సరే కూల్ గా కనిపించే దిల్ రాజు ఈ రోజు ఎమోషనల్ కావడంతో పాటు బాగా ఆగ్రహించేశారు. ఒక చిన్న సినిమా ఈవెంట్ కొచ్చిన సందర్భంగా గత ఏడెనిమిదేళ్లుగా తనను టార్గెట్ చేసుకుని కొన్ని సోషల్ మీడియా వర్గాలు, వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని, ఇకపై ఉపేక్షించేది లేదని చెబుతూ తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడా వీడియో విపరీతంగా వైరలవుతోంది . ఎవరిని ఉద్దేశించో పేర్లు చెప్పకపోయినా ఇంత భావోద్వేగంగా దిల్ రాజును ఎప్పుడు చూడలేదని దగ్గరి వాళ్ళు ఆశ్చర్యంతో చూశారు.

ప్రతి సంక్రాంతికి దిల్ రాజునే ఏదో తప్పులు చేస్తునట్టు ప్రోజెక్ట్ చేయడం సరికాదని, ఇండస్ట్రీలో తొంభై అయిదు శాతం మందికి నచ్చాను కాబట్టి ఇవాళ ఇంత గౌరవంతో ఈ స్థితిలో ఉన్నానని, అందరికీ సంతృప్తి పర్చడం ఎవరి వల్ల కాదని అన్నారు. అంతే కాదు హనుమాన్ ని నేనేదో ఆపుతున్నట్టు అంటున్నారు కానీ నా సామిరంగ, సైంధవ్ లకు సైతం కొన్ని చోట్ల థియేటర్లు దొరకని విషయాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. అంతేకాదు హనుమాన్ ఫంక్షన్ లో చిరంజీవి తన గురించి అంత గొప్పగా చెబితే వాటికి విచిత్ర భాష్యాలు తీశారని వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పరిణామం అందరిని షాక్ కి గురి చేసింది. గుంటూరు కారం విడుదల, కొన్ని ఏరియాల్లో మిగిలిన సినిమాల డిస్ట్రిబ్యూషన్, గేమ్ ఛేంజర్ షూటింగ్ కొనసాగింపు, ఫ్యామిలీ స్టార్ ప్రొడక్షన్, ఆశిష్ చిత్రం తాలూకు వర్క్ ఇలా బోలెడు పనుల్లో తలమునకలైన దిల్ రాజు ఇంతకన్నా ఒత్తిడిని ఎన్నో సందర్భాల్లో చూశారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పాటు వారసుడుని రిలీజ్ చేయడం మీద ట్విట్టర్ లో పెద్ద చర్చే జరిగింది. ఇలాంటివి చూసి చూసి చివరికి ఓపిక నశించి దిల్ రాజు ఫైర్ అయినట్టున్నారు. నవ్వుతూ శాంతంగా కనిపించే రాజుగారి కోపరూపాన్ని ఇవాళ దగ్గరి నుంచి చూపించారు.

This post was last modified on January 8, 2024 10:16 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago