మాములుగా ఫంక్షన్ ఏదైనా స్టార్ హీరోలు వస్తున్నారంటే జనం తండోపతండాలుగా రావడం సహజం. వాళ్ళ దాకా ఎందుకు ఒక మోస్తరు టీవీ యాంకర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లకి వెళ్లినా ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు ఒక పబ్లిక్ ఈవెంట్ కి వస్తే ఎలా ఉండాలి. కానీ విచిత్రంగా నిన్న జరిగిన కరుణానిధి శతజయంతి ఉత్సవం కలైనర్ 100 సందర్భంగా వచ్చిన పబ్లిక్ ని చూసి నిర్వాహకులు సిగ్గుతో చితికిపోయారు. 50 వేల కుర్చీలు వేస్తే పట్టుమని వెయ్యి మంది కూడా చివరి దాకా కూర్చోలేనంత ఘోరంగా ఫ్లాపయ్యింది.
ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేస్తే ఇంత దారుణంగా తిరస్కారానికి గురి కావడం స్టాలిన్ సర్కార్ జీర్ణించుకోలేక పోతోంది. కమల్ రజనిలే కాదు సూర్య, కార్తీ, ధనుష్, శివ కార్తికేయన్. శివ రాజ్ కుమార్, నయనతార, కీర్తి సురేష్, వడివేలు, జీవా, జయం రవి, పార్తిబన్ ఇలా ఎందరో సెలబ్రిటీలు వచ్చారు. అయినా సరే ఇంత పల్చగా అటెండెన్స్ హాజరు కావడం చూసి పోలీస్ డిపార్ట్ మెంట్ సైతం నివ్వెరపోయింది. రద్దీని నియంత్రించలేమనే ఉద్దేశంతో అదనపు బలగాలను తీసుకొస్తే వాళ్లకు భోజన రవాణా ఖర్చులు తప్ప ఏమీ లేదు. పైగా టన్నుల కొద్దీ ఫుడ్డు మిగిలిపోయింది.
విజయ్, అజిత్ లు రాకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వేదిక దగ్గర వందల కుర్చీలు ఖాళీగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఎనలేని కళాసేవ చేసిన ఒక దిగ్గజ కవి, మాజీ ముఖ్యమంత్రికి దక్కాల్సిన గౌరవం ఇది కాదని డీఎంకే ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురించి కాకపోయినా కనీసం కోలీవుడ్ స్టార్లందరూ ఒకేచోట కలుస్తున్నారన్న ఆసక్తి కూడా లేకుండా జనాలు దూరంగా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని పలువురు విశ్లేషకులు ఎపిక్ డిజాస్టర్ గా పేర్కొంటున్నారు.
This post was last modified on January 7, 2024 6:29 pm
ఈ రోజుల్లో ఆడియో క్యాసెట్లు, సీడీలు లేవు. వాటి అమ్మకాలూ లేవు. ఆడియో ఫంక్షన్లూ లేవు. అలాంటపుడు ఆడియోలకు ఏం…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…