పరిశ్రమలో ఎందరో హీరోలకు లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ తో ఒక్క సినిమా అయినా చేయించుకోవాలని ఉంటుంది. సీనియర్లలో ఆ కోరిక అందరికీ నెరవేరింది. బాలకృష్ణ నిప్పురవ్వకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మొదలైన ఈ సంగీత దిగ్గజ ప్రస్థానం వెంకటేష్ సూపర్ పోలీస్, నాగార్జున రక్షకుడు, రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్, కృష్ణంరాజు పల్నాటి పౌరుషం నుంచి పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు నాని దాకా చాలా దూరం ప్రయాణించింది. నాగచైతన్య కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన ఏ మాయ చేసావేకి ఆయన ఇచ్చిన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీనని చెప్పుకోవాలి.
ఒక్క చిరంజీవితో మాత్రమే రెహమాన్ కాంబో సాధ్యపడలేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అబు బాగ్దాద్ గజదొంగ కోసం రెహమాన్ ను తీసుకున్నారు కానీ షూటింగ్ కొంత భాగం అయ్యాక ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. సైరా నరసింహారెడ్డి కోసం అడిగారు కానీ డేట్ల సమస్య వల్ల ఆ అవకాశం కాస్త అమిత్ త్రివేదికి వెళ్లిపోయింది. ఇలా తండ్రి కోరుకుని చేయలేకపోయిన కాంబినేషన్ ఫైనల్ గా రామ్ చరణ్ కి దక్కింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఆర్సి 16కి ఏఆర్ రెహమాన్ పేరు అఫీషియల్ గా ప్రకటించారు.
ఇది ఎప్పుడో తెలిసిన వార్తే అయినా అధికారికంగా ముద్ర పడింది కాబట్టి ఇంకే డౌట్లు ఉండవు. ఆల్రెడీ రెండు పాటల తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని తెలిసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సెట్ చేస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. దేవిశ్రీప్రసాద్ తో ఉప్పెన కోసం అద్భుతమైన పాటలు చేయించుకున్న బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ కోసం రెహమాన్ నుంచి ఎలాంటి సాంగ్స్ రాబట్టుకుంటాడో చూడాలి. వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
This post was last modified on January 6, 2024 5:39 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…