చాలా కాలంగా నాగ చైతన్యని మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న కోరిక తండేల్ తో తీరుతుందని ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో నమ్మకం వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్త నిర్మాణంలో కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే నెలల తరబడి సమయం ఖర్చు చేశారు. లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ లో భాగమైన సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. కార్తికేయ 2 ఘనవిజయం తర్వాత దర్శకుడు చందూ మొండేటి చాలా హోమ్ వర్క్ చేసిన ప్యాన్ ఇండియా మూవీ ఇది. ఇవాళ టీజర్ వదిలారు.
రెండు నిమిషాల వీడియోలో కథకు సంబంధించిన కీలక క్లూలు ఇచ్చారు. పడవ నడుపుకుంటూ, అలల మధ్య జీవిస్తూ, సముద్రాన్ని తల్లిగా భావించే యువకుడు(నాగ చైతన్య) అనుకోని పరిస్థితుల్లో శత్రు దేశం పాకిస్థాన్ చెరకు చిక్కుతాడు. నరకం చూపిస్తున్నా సరే స్నేహితుల మధ్య ఊచలను లెక్కబెడుతూ అక్కడి ఆఫీసర్ల ముందే భారత్ మాతా కి జై అనేంత సాహసం అతనిది. ప్రేమించిన బుజ్జితల్లి(సాయి పల్లవి) తన కోసం ఎదురు చూస్తోందని తెలిసి సంకెళ్లు తెంచుకునేందుకు సిద్ధపడతాడు. అసలు వీళ్ళు అక్కడికి ఎలా వెళ్లారు, పద్మవ్యూహం లాంటి జైలు నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ.
విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడు చందూ మొండేటి తీసుకున్న నేపథ్యం కొత్తగా, ఇంటెన్స్ గా అనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతే స్థాయిలో ఎలివేట్ చేసింది. సాయిపల్లవిని ఒక ఫ్రేమ్ లో చూపించి వదిలేశారు. దుల్ల కొట్టేయాలి, రాబోయేది జాతరే అంటూ శ్రీకాకుళం తరహా యాసలో చైతు పలికే సంభాషణలు, తన గెటప్ మాస్ కి సులభంగా కనెక్ట్ అవుతున్నాయి. తీసిన కొంత భాగం నుంచే ఇంత క్వాలిటీ ఫుటేజిని కట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. ముఖ్యమైన ట్విస్టుని రివీల్ చేయడం సాహసమే. విడుదల తేదీ ఇంకా ఖరారు కాని తండేల్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంది.
This post was last modified on January 6, 2024 12:07 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…