మొత్తానికి సంక్రాంతి సినిమాల పంచాయితీ తెగినట్లే కనిపిస్తోంది. ఐదు సినిమాలకు పండుగ టైంలో థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం కావడంతో చర్చోప చర్చలు, తర్జనభర్జనల అనంతరం ఈగల్ సినిమాను రేసు నుంచి తప్పించారు. ముందు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పదేమో అనుకున్న హనుమాన్ చివరికి బరిలోనే కొనసాగుతోంది. ఈ మేరకు దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి కొంత చర్చనీయాంశం అయ్యాయి.
హీరోల రేంజును బట్టి సినిమాల స్థాయిని నిర్దేశించడం.. హనుమాన్ ను చిన్న సినిమాగా పేర్కొంటూ వరుసలో చివర్లో నిలబెట్టడం పట్ల సోషల్ మీడియాలో చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ చిత్రంలో స్టార్ హీరో లేకపోవచ్చు కానీ సినిమాకు బడ్జెట్ అయితే మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా చిత్రాలకు దీటుగానే నిలిచేలా కనిపిస్తోంది హనుమాన్. కానీ ఈ విషయాన్ని దిల్ రాజు గుర్తించట్లేదు.
మిగతా విషయాలన్నీ పక్కన పెడితే జనవరి 12న హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో 90 శాతానికి పైగా స్క్రీన్ లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 100 స్క్రీన్లలో కనీసం ఓ 20 అయినా తమ సినిమాకు ఇవ్వాలి కదా అంటూ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. హైదరాబాద్ సిటీలో 76 సింగిల్ స్క్రీన్లు ఉంటే 70కి పైగా గుంటూరు కారం తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై ప్రెస్ మీట్లో దిల్ రాజును విలేకరులు ప్రశ్నించబోతే.. ఆయన సమాధానం దాటవేశాడు. వేరే విషయాలు వద్దు, డీవియేట్ చేయొద్దు.. ఇండస్ట్రీ మంచి కోసం ఆలోచించండి అంటూ పొంతన లేని మాటలు చెప్పి విలేకరుల నోళ్లకు తాళం వేసేశాడు. ఒక నిర్మాత ఆవేదన అర్థం చేసుకోకుండా దిల్ రాజు ఇలా నిరంకుశంగా వ్యవహరించిన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని సినిమాలకు న్యాయం చేస్తాం అంటూ తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం చిత్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి హనుమాన్ ను ఇలా తొక్కేయడం సబబా అని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on January 5, 2024 11:22 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…