ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది కొన్ని రోజులుగా. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు బరిలో నిలిచాయి. అందులో ఏ ఒక్కటి తగ్గనంటున్నాయి. ఉన్న వాటిలో చిన్న సినిమా అయినా హనుమాన్ ను రేసు నుంచి తప్పించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది కానీ ఆ చిత్ర బృందం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12న ఆ చిత్రాన్ని కూడా షెడ్యూల్ చేశారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే. ఇది చాలా రిస్క్ అంటూ హనుమాన్ టీంను బెదరగొట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే హనుమాన్ టీంలో అందరూ కూడా తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తూనే, బరిలో ఉన్న మిగతా చిత్రాల గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
తాజాగా ట్విట్టర్లో ఒక నెటిజన్.. హనుమాన్ హీరో తేజ సజ్జ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 20 ఏళ్ల కిందట తేజ బాల నటుడిగా ఉన్నపుడు మహేష్ బాబు సినిమా యువరాజులో అతడి కొడుకు పాత్ర పోషించిన తేజ.. ఇప్పుడు మహేష్ బాబుకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తున్నాడన్నది ఆ పోస్టు సారాంశం. అయితే దీనిపై తేజ వెంటనే స్పందించాడు.
తాను సూపర్ స్టార్ మహేష్ తో పోటీ పడటం ఏంటని ప్రశ్నించాడు. మహేష్ కు పోటీగా కాకుండా మహేష్ తో పాటుగా వస్తున్నానని పేర్కొన్నాడు. ఈ కామెంట్ సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చాలా బాగా చెప్పావు అంటూ తేజను అభినందించాడు. ప్రశాంత్ సైతం తాను మహేష్ బాబు ఫ్యాన్ అని, జనవరి 12న తాను గుంటూరు కారం ఫ్యాన్స్ షో చూస్తానని ఇంతకుముందు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 2, 2024 8:32 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…