Movie News

సర్కారు నౌకరి ఎలా ఉంది

ప్రముఖ గాయని సునీత అబ్బాయి ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన సినిమా సర్కారు నౌకరి. దీని ప్రత్యేకత కె రాఘవేంద్రరావు నిర్మాత కావడం. పబ్లిసిటీ పెద్దగా చేయలేదు కానీ ట్రైలర్ ని చిరంజీవితో లాంచ్ చేయించడం, సోషల్ మీడియాలో కాసింత హడావిడి చేయడంతో కూసింత ఆసక్తి కలిగింది. నూతన సంవత్సరంలో టాలీవుడ్ నుంచి వచ్చిన తొలి స్ట్రెయిట్ రిలీజ్ ఇదే. రెండు రోజుల క్రితం యాంకర్ సుమ వారసుడు రోషన్ కనకాల బబుల్ గమ్ అంచనాలు అందుకోలేకపోయిన నేపథ్యంలో మరి ఆకాష్ ఏమైనా భిన్నమైన ఫలితం అందుకున్నాడో లేదో  రిపోర్ట్ చూస్తే అర్థమైపోతుంది.

ఉమ్మడిరాష్టంగా ఉన్నప్పుడు 1996 ప్రాంతం కొల్లాపూర్ లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. అనాథ అయిన గోపాల్ (ఆకాష్ గోపరాజు) కష్టపడి చదువుకుని హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం తెచ్చుకుంటాడు. సత్య(భావన)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎయిడ్స్ ఉదృతంగా ఉన్న తరుణంలో కండోమ్ లు పంచి గ్రామస్తుల్లో అవగాహన పెంచే డ్యూటీని ప్రభుత్వం గోపాల్ కు అప్పగిస్తుంది. ఈ క్రమంలో అవమానాలు ఎదురవుతాయి. భార్య పుట్టింటికి వెళ్తానన్నా చలించడు. మరి పనే దైవంగా భావించే గోపాల్ ఇదంతా తట్టుకుని తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడు అనేదే కథ.

జనాలు ఎప్పుడో మర్చిపోయి ఎయిడ్స్ ప్రమాదకారి కాదనే స్థితికి సమాజం చేరాక ఆ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడంలో దర్శకుడు గంగామోని శేఖర్ పెద్ద రిస్క్ చేశాడు. అయితే ఎంటర్ టైన్మెంట్, డ్రామా సమపాళ్ళలో ఉంటే ఇలాంటి కథలతో మెప్పించడం కష్టమేమి కాదు. కానీ సర్కారు నౌకరికి ఈ విషయంలో పెద్దగా హోమ్ వర్క్ జరగలేదు. అక్కడక్కడా కామెడీ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో నాటకీయత మరీ ఎక్కువైపోవడంతో డాక్యుమెంటరీకి సినిమాకి మధ్య నలిగిపోయింది. ఎమోషన్ ని ఓవర్ ప్లే చేశారు. 90 వాతావరణాన్ని సహజంగా సృష్టించినా ఆ ఒక్క అంశం సినిమాను నిలబెట్టలేకపోయింది. 

This post was last modified on January 2, 2024 4:15 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago