అతివృష్టి అనావృష్టి సామెత మన టాలీవుడ్ కు అచ్చంగా సరిపోతుంది. వస్తేనేమో వరదాగా ఒకేసారి రిలీజులతో మీద పడతారు. లేదా మంచి డేట్లను ఖాళీగా వదిలేస్తారు. జనవరి 26 నేషనల్ హాలిడే అలాగే కాబోతోంది. ఇప్పటిదాకా ఆ డేట్ కి షెడ్యూల్ చేసుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రెండే. ఒకటి వర్మ తీసిన వ్యూహం సీక్వెల్ శపథం. మొదటి భాగమే కోర్ట్ స్టే వల్ల ఆగిపోయింది కాబట్టి ఇది రానట్టే. రెండోది నారా రోహిత్ ప్రతినిథి 2. షూటింగ్ జరుగుతోంది కానీ టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. టీవీ5 మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చేది లేనిది ఇంకొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.
వీటి సంగతి కాసేపు పక్కనపెడితే ఆ వారం మొత్తం ఇతర బాషా చిత్రాలతో నిండిపోనుంది. హృతిక్ రోషన్ ఫైటర్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పఠాన్ డేట్ కావడంతో బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ తో పాటు కంటెంట్ మీద నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. రజనీకాంత్ ప్రత్యేక పాత్ర చేసినప్పటికీ ఆయన పేరు మీదే అమ్ముతున్న లాల్ సలామ్ అదే రోజున థియేటర్లలో అడుగుపెట్టనుంది. జైలర్ పుణ్యమాని ఏపీ తెలంగాణ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ ప్యాన్ ఇండియా విడుదలకు రెడీ అవుతోంది. ఆయన కెరీర్లోనే అత్యంత ఖరీదైన బడ్జెట్ గా చెప్పుకుంటున్నారు.
విక్రమ్ తంగలాన్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ వాయిదా పడింది. ఫిలిం ఫెస్టివల్స్ కోసం ఆలస్యం చేస్తున్నారని చెన్నై టాక్. ఒకవేళ ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ కనక జనవరి 19 రాకపోతే అది కూడా గణతంత్ర దినోత్సవాన్నే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ లెక్కన ఆ వారం బాక్సాఫీస్ మొత్తం పరభాషా సమర్పణం అయ్యేలా ఉంది. సంక్రాంతికి ఢీ కొంటున్న అయిదు భారీ సినిమాల్లో ఏదో ఒకటి కనీసం ఈ 26కి వచ్చి ఉంటే బాగుండేదని ట్రేడ్ అభిప్రాయపడుతున్నప్పటికీ పంతాల మధ్య ప్రమోషన్ల స్పీడ్ పెంచేసిన నిర్మాతలు ఈ మాటలు వినే పరిస్థితిలో ముమ్మాటికీ లేరు.
This post was last modified on January 2, 2024 4:02 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…