Movie News

రాజమౌళి రికార్డులను టచ్ చేయగలరా

గుంటూరు కారంతో రాజమౌళి రికార్డుల దగ్గరికి వెళ్తామని నెలల క్రితం నిర్మాత నాగవంశీ అన్న మాటలు ఇప్పుడు ఫ్రెష్ గా వైరలవుతున్నాయి. నిజానికి ఆ ఇంటర్వ్యూ  టైంలో ఇంత పోటీ ఉంటుందని ఎవరికీ తెలియదు. ఇంకో రెండు సినిమాలు ఉంటాయని ఊహించారు కాని కాంపిటీషన్ చాలా టఫ్ గా మారుతుందనేది కలలో కూడా అనుకోని ట్విస్ట్. నిజంగా మహేష్ బాబుతో బాహుబలి లేదా ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన బెంచ్ మార్కులను దాటడం సాధ్యమా అంటే, సోలో వచ్చి ఉంటే ఏమో కానీ ఇప్పుడు మాత్రం అసాధ్యమే అంటున్నాయి ఆరితేరిన ట్రేడ్ వర్గాలు.

అలా అనుకోవడంలో లాజిక్ ఉంది. ఎందుకంటే ప్రతి చిత్రానికి బలమైన బ్యాకప్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్నాయి. ఆ ధీమాతోనే ఎవరూ వెనక్కు తగ్గమంటూ బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. సైంధవ్ కి సురేష్ బాబు స్వంత థియేటర్లతో పాటు ఎన్నో ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న ఏషియన్ ఫిలిమ్స్ తోడ్పాటు చాలా ఉంటుంది. హనుమాన్ కి మైత్రి అండదండలు పెద్ద ఎత్తున పని చేయబోతున్నాయి. నా సామిరంగకు అన్నపూర్ణ స్టూడియోస్ దన్నుతో పాటు గీత ఆర్ట్స్ సపోర్ట్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఈగల్ కోసం ఇద్దరు ప్రముఖ పంపిణీదారులు రంగంలోకి దిగుతారని తెలిసింది.

ఇక్కడ థియేటర్ల సర్దుబాటు తీవ్ర సమస్య. జనవరి 12 హనుమాన్ తో తలపడే గుంటూరు కారంకి మొదటి రోజు షోలు, కలెక్షన్ల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ 13 నుంచి స్క్రీన్ కౌంట్ విషయంలో ఎంతో రాజీ పడాల్సి ఉంటుంది. దాని వల్ల మేజిక్ ఫిగర్లు సాధ్యం కావు. ఉదాహరణకు మూడు థియేటర్లుండే చిన్న సెంటర్లో 15 షోలకు గాను మహేష్ కి మహా అయితే ఏడు షోలు దొరికితేనే గొప్పనుకోవాలి. ఇలా చూసుకుంటూ పోతే వందల కేంద్రాలు తేలుతాయి. సోలోగా వచ్చిన సలారే కెజిఎఫ్ ని టచ్ చేయలేకపోయింది. మరి గుంటూరు కారం ఏకంగా జక్కన్నని లక్ష్యంగా పెట్టుకుంది. ఏం చేస్తుందో చూడాలి. 

This post was last modified on January 2, 2024 11:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లక్కీ భాస్కర్.. సాధించాడహో

ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…

11 mins ago

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…

2 hours ago

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…

2 hours ago

లోకేష్ స్పీచ్‌కు లైకులు ప‌డుతున్నాయ్‌.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్ర‌సంగాల‌కు మంచి లైకులు ప‌డు తున్నాయి. ఇది ఏదో…

2 hours ago

పుష్ప-2లో షాడో విలన్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…

2 hours ago

విశ్వక్‌కు అప్పుడు నో చెప్పిన హీరోయినే..

ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…

4 hours ago