యానిమల్ తో తొమ్మిది వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగా సినిమా ఫైనల్ రన్ కి దగ్గరగా ఉన్నా ప్రమోషన్ మాత్రం ఆపడం లేదు. వీలు కుదిరినప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వెర్షన్ కోసం ఇప్పటికీ ఎడిటింగ్ పనుల్లో తలమునకలై కంటెంట్ ఇంకా బెటర్ గా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంగతులు పంచుకుంటున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద సందీప్ వంగా ఫ్యానిజం గురించి అందరికీ తెలిసిందే. అతని పాత ట్వీట్లు చూస్తే ఫోటోల రూపంలో సాక్ష్యాలతో సహా కనిపిస్తుంది.
సందీప్ వంగా తన మెమరీతో మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాడు. తన మీద మెగాస్టార్ ప్రభావం గురించి ఒక ఉదాహరణ చెబుతూ మాస్టర్ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు. అందులో ప్రేమించమని వెంటపడుతున్న హీరోయిన్ సాక్షి శివానంద్ కు చిరంజీవి క్లాసు తీసుకుంటాడు. సిగరెట్ తాగుతూ నా గురించి నీకేం తెలుసనీ ఆవేశంగా ప్రశ్నిస్తూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. ఆ టైంలో చిరు వేసుకున్న చొక్కా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సరిగ్గా ఈ సన్నివేశమే సందీప్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా చిరంజీవి సిగరెట్ తాగే విధానం మైండ్ కి బాగా ఎక్కేసి తర్వాత దాన్నే అలవాటుగా చేసుకున్నాడట.
ఇలా ఎప్పుడో 1997లో వచ్చిన సినిమాలో షర్ట్ కలర్ ని కూడా గుర్తు పెట్టుకోవడం అంటే వీరాభిమానులకే సాధ్యం. ఇక్కడ చూడాల్సింది అది కాదు. సందీప్ లోని పరిశీలకుడు ఎంత డిటైల్డ్ గా ఆ పాత్ర ప్రవర్తనని తన మనసులో రిజిస్టర్ చేసుకున్నాడనేది. ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఇంత స్పష్టంగా చెప్పడం చూస్తే సినిమా మేకింగ్ కు సంబంధించిన నేర్చుకోవడం ఎలా ఉండాలనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అగ్రెసివ్ హీరోయిజంకి కొత్త డెఫినిషన్లు రాస్తున్న సందీప్ వంగా నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ లో ప్రభాస్ ని ఏ స్థాయిలో చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
This post was last modified on January 1, 2024 10:31 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…