నాగచైతన్యకి కస్టడీ రూపంలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుకి సుడి బాగుండి వెంటనే స్టార్ హీరో విజయ్ తో ప్యాన్ ఇండియా మూవీ పట్టేశాడు. షూటింగ్ ఆల్రెడీ సగానికి పైగా అయిపోయింది. నిన్న సాయంత్రం టైటిల్ ప్రకటించారు. ముందే లీకైన ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం (GOAT) పేరుని ఖరారు చేస్తూ డబుల్ రోల్ చేస్తున్నట్టుగా ఉన్న ఇద్దరు విజయ్ ల పోస్టర్ ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో కృత్రిమ సాంకేతికత ద్వారా విజయ్ యువకుడిగా కనిపించేందుకు ఆరు కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గోట్ ఒరిజినల్ కథ కాదనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించి రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. మొదటిది 1971 అర్ధాంతరంగా అదృశ్యమైన డిబి కూపర్ అనే పైలట్ బయోపిక్ గా చెబుతున్నారు. ఓసారి ఫ్లైట్ రన్నింగ్ లో ఉండగా ఒక పెద్ద బ్యాగు నిండా బంగారం, డబ్బుతో వెనుక నుంచి ప్యారాచూట్ వేసుకుని దూకి పారిపోయాడు, విమానం క్షేమంగా ల్యాండ్ అయ్యాక కూపర్ మాయమైన విషయాన్ని పసిగట్టారు. ఎఫ్బిఐ చరిత్రలో పరిష్కరించేలేకపోయిన అత్యంత క్లిష్టమైన కేసుల్లో కూపర్ ది ప్రత్యేక స్థానం. తర్వాత ఆయన గతాన్ని తవ్వితే చాలా షాకింగ్ విషయాలు బయట పడ్డాయట.
ఇక రెండో కోణం 2019లో వచ్చిన జెమినీ మ్యాన్ ని ఇది అనధికార రీమేకని. అచ్చం తనలాగే ఉండే తన క్లోన్ తో హీరో చేసే పోరాటంతో తెరకెక్కి మంచి విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. విల్ స్మిత్ త్రిపాత్రలు గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాయి. ఈ అభిప్రాయాలను సోషల్ మీడియాలో చూసి వెంకట్ ప్రభు ఖండిస్తున్నారు కానీ నిజమేంటో తెలియాలంటే విడుదలయ్యే దాకా వేచి చూడాల్సిందే. లియో లాగా వచ్చే ఏడాది దీపావళి రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా ప్రభుదేవా, ప్రశాంత్, లైలా, జయరాం ఇతర తారాగణం.
This post was last modified on January 1, 2024 1:12 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…