ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఓ మై బేబీ టైంలో కొంత నీరసం అనిపించినా కుర్చీ మడత పెట్టి వచ్చాక అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. ఇందులో మహేష్ బాబు చేసిన క్యారెక్టర్ ఏంటనే ఉత్సుకత ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. కథ ప్రకారం మహేష్ చేస్తున్న వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు ఏదైనా తేడా వస్తే చితకొట్టేయడం అతని స్టైల్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఊహించిన దానికన్నా చాలా మాస్ గా ఉంటుందట. జగపతి బాబుతో తలపడే ఫైట్లు, అనుచరులతో చేసే పోరాటాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. వ్యాపారపరంగా అతనితో వచ్చిన శత్రుత్వానికి, తన స్వంత కుటుంబంలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది. తాతయ్యగా ప్రకాష్ రాజ్, తల్లిగా రమ్యకృష్ణల క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్టులు ఎమోషనల్ గా ఉంటాయని తెలిసింది. మొత్తానికి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట.
హయ్యెస్ట్ ఓపెనింగ్ ని ఆశిస్తున్న అభిమానులకు విపరీతమైన పోటీ అసహనం కలిగిస్తోంది. ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పండగ కలెక్షన్లలో మహేష్ ఎంత డామినేట్ చేసినా సరే మిగిలిన సినిమాలు తీసుకునే రెవిన్యూని ఆ మేరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయినా టాప్ వన్ లేదా టూలో నిలిచే అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. పైగా 12, 13 తేదీల్లో ఇంకో నాలుగు రిలీజులు ఉండటం బాక్సాఫీస్ హీట్ ని పెంచుతోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న నాలుగో ఆడియో సింగల్ తో పాటల లాంఛనం పూర్తవుతుంది. జనవరి 6 ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on December 31, 2023 9:02 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…