Movie News

డిజిటల్ నాన్న త్వరగా వచ్చేస్తున్నాడు

న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న అనుకున్న టైం కన్నా ముందుగానే ఓటిటిలో వచ్చేస్తున్నాడు. జనవరి 4 నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజానికి సంక్రాంతి పండగకు ఉంటుందనే ప్రచారం జరిగింది హఠాత్తుగా ఈ వార్త వచ్చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. డిసెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న హాయ్ నాన్న నెల రోజులు తిరక్కుండానే డిజిటల్ లో అడుగు పెట్టడం విశేషమే. నాలుగు వారాల నిడివి కంటే రెండు రోజులు ముందుగానే రావడం మరో ట్విస్ట్.

స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటించిన హాయ్ నాన్న కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అందుకుంది. టార్గెట్ పెట్టుకున్న ముప్పై కోట్లను రెండు వారాలు దాటగానే పూర్తి చేయడంతో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చాక ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే ప్రభాస్ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఉన్న కారణంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి వీకెండ్ లో నాని మూవీనే ఛాయస్ అయ్యింది. ఈ వీకెండ్ బుక్ మై షోలో పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం. ఇప్పటికీ మెయిన్ సెంటర్స్ అన్నింటిలో హాయ్ నాన్న రన్ అవుతోంది. సలార్ మొదటి వారం పూర్తయ్యాక తిరిగి స్క్రీన్లు ఇచ్చారు.

ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇవ్వడం వల్లే త్వరగా స్మార్ట్ స్క్రీన్ కి వచ్చేస్తోందని అర్థమవుతోంది. దసరా లాంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎమోషనల్ మూవీ కనెక్ట్ అవుతుందో లేదో నేనే ఫ్యాన్స్ అనుమానాలకు హాయ్ నాన్న విజయం చెక్ పెట్టింది. భావోద్వేగాలు కదిలించేలా ఉంటే సక్సెస్ వస్తుందని రుజువయ్యింది. దర్శకుడిగా మొదటి అడుగులోనే విజయం అందుకున్న శౌర్యువ్ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ప్రధాన పాత్రలు పోషించిన హాయ్ నాన్నకు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎర్లీ స్ట్రీమింగ్ కాబట్టి వ్యూస్ భారీగా ఉండబోతున్నాయి. 

This post was last modified on December 30, 2023 11:38 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

8 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

21 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

32 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago