అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. మన ప్రభాస్ చేయబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యాడు. ప్రభాస్ ఇందులో రాముడి పాత్రను చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు లంకేష్ అని కూడా వెల్లడించారు.
ఐతే ప్రభాస్‌కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్‌లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులే సైఫ్ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినపుడున్న ఎగ్జైట్మెంట్ సైఫ్‌ను విలన్ పాత్రకు ఎంపిక చేసినపుడు కనిపించడం లేదు. ఈ పాత్రలో ఏ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లో అయితే బాగుండేదని.. ప్రభాస్‌కు దీటుగా ఉండేవాడని అంటున్నారు.
ఐతే సౌత్ నుంచి వచ్చి నార్త్‌లో హవా సాగిస్తున్న ప్రభాస్ విషయంలో బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే అసూయతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అతను రాముడిగా నటించే సినిమాలో తాము విలన్ పాత్ర చేయడమేంటని వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు. దీంతో సైఫ్‌తో సర్దుకుపోతున్నట్లున్నారు.
This post was last modified on September 3, 2020 2:43 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…