తాజాగా విడుదలైన డెవిల్ కు హీరో కళ్యాణ్ రామ్ సీక్వెల్ ప్రకటించేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం చిన్న సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకున్న టీమ్ పరస్పరం కేకులు తినిపించుకున్నాక మంచి జోష్ ఉన్న హీరో అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇంకా బాక్సాఫీస్ ఫలితం తేలలేదు. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా డివైడ్ గానే ఉంది. కానీ గత ఏడాది బింబిసారకు అలా జరగలేదు. మార్నింగ్ షో కావడం ఆలస్యం బాగుందనే మాట బయటికి వచ్చింది. ఫలితంగా ఈవెనింగ్ షోల నుంచే హౌస్ ఫుల్స్ పడి క్రమంగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది.
ఇప్పుడు డెవిల్ కి అలాగే జరిగి ఉంటే పార్ట్ టూకి న్యాయం జరుగుతుంది. అసలే దర్శకుడి ఇష్యూ మీద చర్చల్లో నలిగింది. మొదట ప్రాజెక్టు టేకప్ చేసిన నవీన్ మేడారం సినిమా ఎలా ఉందంటూ అభిప్రాయాలు అడుగుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు. ఇంకో వైపు డైరెక్టర్ చైర్ తీసుకున్న నిర్మాత అభిషేక్ నామా ఇంత అనుభవమున్న నేను తీయలేనా అంటూ లాజికల్ గా సమాధానం చెప్పి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా తీసింది ఆయనైనా లేక నవీనైనా ప్రెజెంటేషన్ లోని అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఫైనల్ రన్ అయ్యాకే హిట్టో ఫ్లాపో తేలుతుంది.
నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది బింబిసార 2ని. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరితో అనేది తేల్చడం లేదు. మొదటి భాగం తీసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరకు వెళ్లిపోవడంతో మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు దీని సంగతి చెబితే బాగుంటుంది కానీ ఇంకా రిజల్ట్ రాని డెవిల్ మీద అంత కాన్ఫిడెన్స్ తో రెండో భాగం ప్రకటించడం ఒకరకంగా పొరపాటేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కొనసాగంపు మీద ఆసక్తి రావాలంటే బ్లాక్ బస్టర్ల విషయంలోనే అది జరుగుతుంది. అయినా కళ్యాణ్ రామ్ ఇంకొద్ది రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదేమో.
This post was last modified on December 29, 2023 10:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…