నా సామిరంగ విడుదల తేదీ జనవరి 14 కన్ఫర్మని నిన్నటి దాకా ఉన్న పక్కా సమాచారం. అక్కినేని వర్గాలతో పాటు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇదే మాట చెబుతూ వచ్చారు. షూటింగ్ నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఈ కారణంగానే రావాలని ఉన్నా కూడా వెంకటేష్ 75 ఈవెంట్ కి నాగ్ హాజరు కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రావాల్సిందేననే పట్టుదలతో హీరోతో పాటు దర్శకుడిగా మొదటి సారి మెగా ఫోన్ చేపట్టిన విజయ్ బిన్నీ చాలా కష్టపడుతున్నాడు. టీజర్ చూశాక అభిమానుల్లో నమ్మకం వచ్చేసింది. పాటలు మెల్లగా ఎక్కుతున్నాయి. కానీ ఇరవై నాలుగు గంటల టైంలో తెరవెనుక కొత్త కథలు జరిగిపోతున్నాయి.
ఎలాగైనా సరే నా సామిరంగను వాయిదా వేసేలా ఒప్పిస్తున్నారనే వార్త ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. మంచి కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు తక్కువ థియేటర్లతో ఎందుకు రాజీ పడతారనే పాయింట్ మీద నాగార్జునతో పలువురు పెద్దలు చర్చిస్తున్నారట. ఒకవేళ నిజంగా హిట్ అయినా సరే అగ్రిమెంట్ల వల్ల గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్ లతో స్క్రీన్లు పంచుకునే కారణంగా ఆశించిన రెవిన్యూ రాదనే కోణంలో డిస్కషన్లు చేస్తున్నారట. అయితే మిగిలినవాటికి ఈ రిస్క్ ఉన్నప్పటికీ థియేటర్, ఓటిటి డీల్స్ ని పక్కాగా పూర్తి చేసుకోవడంతో ఇబ్బంది లేదని అంటున్నారు.
నాగ్ మూవీకి మరో చిక్కు ఉంది. ఇప్పటిదాకా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించని సినిమాల్లో నా సామిరంగనే ఆఖరుది. ప్రతి పోస్టర్ లో పండగని హైలైట్ చేయడం తప్పించి తేదీని ఎక్కడా పేర్కొనలేదు. అలాంటప్పుడు రాజీ పడితే తప్పేమి లేదని అడుగుతున్నారట. నాగార్జున ప్రస్తుతం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు చేసుకోలేదు కానీ ప్రొడ్యూసర్ మనసు మారిందని ఇన్ సైడ్ టాక్. ఇంకో రెండు రోజుల్లో ఏదో ఒకటి తేల్చేయాలి. జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా అందరూ కొత్త అప్డేట్లు ఇస్తారు కాబట్టి నా సామిరంగ ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని మ్యాటర్ తేల్చకపోతే కొత్త డౌట్లు వస్తాయి.
This post was last modified on December 29, 2023 10:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…