స్టార్ యాంకర్ సుమ, క్యారెక్టర్ ఆర్టిస్టు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం చేసిన బబుల్ గమ్ మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేకపోయింది కానీ వారం పది రోజుల నుంచి నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేయడంతో క్రమంగా దృష్టి పడింది. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ చూపించిన కాన్ఫిడెన్స్ ఆశ్చర్యపరిచింది. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకుడు కావడం ఆసక్తి రేపింది. ఒక రోజు ముందు సాయంత్రమే ప్రధాన కేంద్రాల్లో ప్రీమియర్లు వేసి టీమ్ ఆశ్చర్యపరిచింది. కళ్యాణ్ రామ్ డెవిల్ తో పోటీకి సై అంటూ వచ్చిన బబుల్ గమ్ రిపోర్ట్ ఏంటో చూద్దాం.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆది(రోషన్ కనకాల)కి జీవితంలో పెద్ద డీజే కావాలని గోల్ పెట్టుకుంటాడు. ధనవంతురాలైన జాన్వీ (మానస చౌదరి)ని ఓ పార్టీలో చూసి ఇష్టపడతాడు. అయితే మాడరన్ లైఫ్ స్టైల్ కి అలవాటుపడిన జానుకి అబ్బాయిల మీద సదభిప్రాయం ఉండదు. ఇద్దరి మధ్య మెల్లగా మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే ఒక ఫ్రెండ్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయే దాకా వెళ్తుంది. ఆది తట్టుకోలేకపోతాడు. మరి ఈ ప్రేమ జంట ప్రయాణం ఎలా జరిగింది, చివరికి ఆది తన కలను నెరవేర్చుకున్నాడా లేదనేది అసలు కథ.
దర్శకుడు రవికాంత్ లో సెన్సిబుల్ యూత్ యాంగిల్ ఉంది. తన ఆలోచనలు లౌడ్ గా ప్రెజెంట్ చేసినా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. కానీ బబుల్ గమ్ లో బలహీనమైన కథను ఎంచుకుని, దానికి ఈగోలను ముడిపెట్టడంతో ఎక్కడా కొత్తదనం అనిపించదు. ఆదిని అర్జున్ రెడ్డి స్టైల్ లో ప్రెజెంట్ చేయాలని చూడటం మైనస్ అయ్యింది. ఆది, జానుల మధ్య ప్రేమే కన్విన్సింగ్ గా అనిపించదు. ఇంటర్వెల్ తర్వాత కథనం పూర్తిగా గాడి తప్పింది. టైటిల్ లో ఉన్న బబుల్ గమ్ లాగే సాగతీత అయిపోయింది. రోషన్ నటన, సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతు పెర్ఫార్మన్స్ ఆకట్టుకున్నా తెడ్డు తెగిపోయిన పడవను కాపాడలేకపోయారు.
This post was last modified on December 29, 2023 9:50 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…