సంక్రాంతికి టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకే తలనెప్పిగా ఉంటే ఇంకా డబ్బింగ్ వాటి గురించి అడుగుతారేంటని ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం గుర్తే. అయితే ధనుష్ కెప్టెన్ మిల్లర్ రేస్ లోకి రావడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న జనవరి 12నే రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా పోస్టర్ తో పాటు ప్రకటించింది. కోలీవుడ్ కి సైతం పొంగల్ చాలా కీలకమైన పండగ కావడంతో స్టార్ హీరోలు ఈ సీజన్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. పైగా రజినీకాంత్ లాల్ సలామ్ తప్పుకోవడంతో అల్లుడు ధనుష్ కి రూటు క్లియరయిపోయింది.
ఇప్పుడు అసలు సమస్య మరొకటుంది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ ని నిలువరించేలా మన నిర్మాతల సమాఖ్య చొరవ తీసుకుంటారా అనేదే భేతాళ ప్రశ్న. ఎందుకంటే ఎవరో ఒకరు హక్కులు కొంటారు. బ్యాకప్ గా పేరున్న డిస్ట్రిబ్యూటర్లు ముందుకొస్తారు. దాంతో సహజంగానే ఎన్నో కొన్ని థియేటర్లు ధనుష్ బొమ్మకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎన్నో సార్లు వచ్చిన చిక్కే. గతంలో పేట ప్రొడ్యూసర్లు మీడియాకెక్కి మరీ రచ్చ చేశారు. ఈ సంవత్సరం వారసుడుని తెచ్చినందుకు దిల్ రాజు సైతం టార్గెట్ అయ్యారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ ని ఎలా అడ్డుకోగలరు.
క్రేజ్ పరంగా గుంటూరు కారం, హనుమాన్ లతో ధనుష్ కి పోలిక లేకపోవచ్చు. కానీ ఏపీ తెలంగాణ కలిపి కనీసం ఒక వంద స్క్రీన్లు ఇచ్చినా ఆ మేరకు మహేష్, వెంకీ, నాగార్జున, రవితేజ, తేజ సజ్జలు ఆ కౌంట్ ని కోల్పోయినట్టే. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. శివ కార్తికేయన్ అయలన్ కూడా వస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. ఇతనూ రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ కోరుకుంటాడు. మనం ఇంతగా తలలు పగలగొట్టుకుంటున్నాం కానీ అదే తమిళనాడులో మన సంక్రాంతి సినిమాలకు సింగల్ డిజిట్ థియేటర్లు ఇచ్చినా గొప్పే అనుకోవాలి.
This post was last modified on December 29, 2023 8:36 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…