కొత్త సినిమా విడుదల అంటే ప్రమోషన్లు చాలా ముఖ్యం. అందులో అత్యంత ముఖ్యమైన ప్రి రిలీజ్ ఈవెంట్. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఈ ఈవెంట్ చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. అయితే ఆరు నెలలుగా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల లేదు. మరి కొన్ని నెలలు ఆ అవకాశాలు కనిపించడం లేదు.
ఇలాంటి టైంలో ఓ కొత్త సినిమాకు ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంకో రెండు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వి’ సినిమాకు సంబంధించి ఈ ఈవెంట్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 5న, శనివారం ఈ చిత్రం విడుదల కానుండగా.. ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ‘వి’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.
ప్రస్తుత కరోనా సమయంలో ఈ ఈవెంట్ ఎక్కడ చేస్తారు.. జనాలను ఎలా అనుమతిస్తారు అని సందేహం కలగొచ్చు. కానీ లాక్ డౌన్ టైంలో అలవాటు పడ్డ వర్చువల్ స్టయిల్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు వెన్యూగా ‘మీ స్క్రీన్లు’ అని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. అంటే చిత్ర బృందం అంతా ఒక చోటికి చేరి అక్కడి నుంచే తమ సినిమా గురించి మాట్లాడుతుందన్నమాట.
వాళ్లతో వర్చువల్‌గా కనెక్ట్ అయి ఈ ఈవెంట్లో భాగం కావచ్చు. ప్రధాన తారాగణం అయిన నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్‌లతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. టాలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది జనాల్లో. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ‘వి’ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అని చిత్ర బృందమే కాదు.. ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on September 3, 2020 2:38 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…