దిల్ రాజు సంస్థలో బేబి

బేబి.. గత కొన్నేళ్లలో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో చాలామంది జీవితాలు మారిపోయాయి. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేస్తున్నారు. వీరి కలయికలో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. హీరో ఆనంద్ దేవరకొండ కూడా బిజీ అయిపోయాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్య చేతికి మూణ్నాలుగు ప్రాజెక్టులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అందులో ఒకటి బేబీ హీరో ఆనంద్ దేవరకొండతో కలిసి చేస్తున్న సినిమానే. దాని గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా వైష్ణవి చైతన్య అందుకున్న పెద్ద అవకాశం గురించి వార్త బయటకు వచ్చింది వైష్ణవి అందుకున్న ఓ పెద్ద అవకాశం గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమె అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్లో నటించబోతుండడం విశేషం.

దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయక నటించబోతోంది. అరుణ్ భీమవరపు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రౌడీ బాయ్స్ మూవీ తో హీరోగా పరిచయం అయిన ఆశిష్ ఇప్పటికే సెల్ఫిష్ అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే అతడి మూడో సినిమా అనౌన్స్ అయింది. ఆ చిత్రంలో వైష్ణవి హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో ఆమె ఒక మోడరన్ అమ్మాయి పాత్ర చేస్తున్నట్లు తన ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది.

ఈ చిత్రానికి ‘లవ్ మి’ అనే ట్రెండీ టైటిల్ అనుకుంటున్నారు. ఎంఎం కీరవాణి, పీసీ శ్రీరామ్ అండ్ లాంటి లెజెండరీ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తుండడం విశేషం. కొంచెం పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమాను నిర్మించబోతోందట దిల్ రాజు ఫ్యామిలీ.