పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఒక పట్టాన తేలేది కాదు. ఆయన కొంచెం నెమ్మదిగా సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ కూడా తీసుకుంటుంటాడు. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు నుంచి పవన్ శైలి ఇంతే.
రాజకీయాల్లో బిజీ అయ్యాక మరీ సినిమాలు తగ్గించేశాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత కొంచెం స్పీడు పెంచి ఓ నాలుగు సినిమాలు లాగించేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.
ఐతే 2024 ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు వరకు సినిమాలు చేయాలని చూస్తున్న పవన్.. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆల్రెడీ రెండు సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. ఇంకో రెండు సినిమాలు కమిటయ్యాడు. వాటి గురించి పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్‌డేట్లు కూడా వచ్చాయి.
‘వకీల్ సాబ్’తో పాటుగా క్రిష్ సినిమాను పూర్తి చేశాక హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లోకి వస్తాయి. ఐతే పవన్‌తో సినిమా కోసం ఆల్రెడీ ఏడాది నుంచి పని చేస్తున్నాడు హరీష్. స్క్రిప్టు కూడా ఆల్రెడీ పూర్తయింది. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సినిమా మొదలుపెట్టడానికి అతను రెడీగా ఉన్నాడు. కానీ కనీసం ఏడాది పాటు పవన్ ఈ సినిమా మొదలుపెట్టే సూచనలు కనిపించట్లేదు.
ఈ గ్యాప్‌లో హరీష్ ఇంకో సినిమా చేసుకోవడానికి అవకాశముంది. కానీ పవన్‌తో సినిమా చేయబోతూ తన శక్తి సామర్థ్యాల్ని మరో సినిమా మీదికి మళ్లించనని.. ఆ చిత్రం మొదలయ్యే వరకు ఎదురు చూస్తానని అంటున్నాడు హరీష్. అలా హరీష్ లాక్ అయిపోయాడు. ఇక సురేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి కాబోతోంది.
చిరంజీవితో ‘సైరా’ సినిమా చేశాక పది నెలలుగా ఖాళీగా ఉన్నాడు సురేందర్. ఎవరెవరితోనో సినిమా అనుకున్నాడు. కానీ ఏ కాంబినేషన్ కాలేదు. అనుకోకుండా పవన్‌తో సినిమా చేసే అరుదైన అవకాశం వచ్చింది. దీని మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్న సురేందర్.. పవన్ అందుబాటులోకి వచ్చేవరకు ఇంకో సినిమా చేయొద్దని ఫిక్సయిపోయాడట. ఇలా పవన్ ఒకరికిద్దరు స్టార్ డైరెక్టర్లను లాక్ చేసి పడేశాడని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
This post was last modified on September 3, 2020 12:37 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…