జూనియర్ ఎన్టీఆర్ దేవర టీజర్ ఎప్పుడు వచ్చేది డేట్ ఇంకా చెప్పలేదు కానీ ఈలోగా దానికి సంబంధించిన అప్డేట్స్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డెవిల్ కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ తమ్ముడు సినిమా అద్భుతంగా వస్తోందని, తారక్ ని పవర్ ఫుల్ గా ఆవిష్కరించడంతో పాటు టాలీవుడ్ తెరమీద ఎన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరుస్తామని హామీ ఇస్తున్నాడు. నిర్మాతే స్వయంగా చెప్పాక ఇక ఫ్యాన్స్ అంచనాలకు అడ్డెక్కడిది. ఇది ఇక్కడితో ఆగలేదు. తాజాగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తోడయ్యాడు.
దేవరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో ఏ స్థాయి హైప్ ఉందో చెప్పనక్కర్లేదు. విపరీతమైన బిజీగా ఉన్న అనిరుద్ స్వయంగా టీజర్ గురించి ట్విట్టర్లో చెప్పాడంటే దానికి సంబంధించిన రీ రికార్డింగ్ అయిపోయిందనే అర్థం. ఫ్యామిలీ వెకేషన్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ కి ఫైనల్ కాపీని మరో రెండు మూడు రోజుల్లో పంపించి అంగీకారం తీసుకుంటారట. దేవర ప్రపంచాన్ని ఊహించనంత భారీగా ఆవిష్కరిస్తారని తెలిసింది. సంక్రాంతికి విడుదలయ్యే గుంటూరు కారంతో పాటు థియేటర్లలో దేవర టీజర్ ని స్క్రీనింగ్ చేసేలా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవరకు ఎక్కువ సమయం లేదు. ఈ ఏడాది అయిపోయింది కాబట్టి చేతిలో మూడు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పైగానే పూర్తయ్యిందని చెబుతున్న కళ్యాణ్ రామ్ మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తామని అంటున్నాడు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే మార్చి మొత్తం ఇండియా వైడ్ ప్రమోషన్ టూర్ ప్లాన్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ కావడంతో నార్త్ వర్గాల్లో అదనపు ఆసక్తి తోడైంది. దేవర 2 వేసవి తర్వాత ప్రారంభమవ్వొచ్చు.
This post was last modified on December 26, 2023 9:46 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…