ప్రమోషన్లు జోరుగా చేస్తున్నా విడుదల తేదీని ఇప్పటిదాకా ప్రకటించని నా సామిరంగ జనవరి 14 లాక్ చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డేట్ ముందే లీకయ్యింది కానీ గుంటూరు కారం కన్నా ఓ రెండు రోజులు ముందే వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు జోరుగా జరిగాయట. అయితే రెండు విషయాలు ఇది సాధ్యం కాకుండా చేశాయని వినికిడి. మొదటిది షూటింగ్, సెన్సార్ పూర్తవ్వడానికి జనవరి మొదటి వారం పట్టేలా ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపించి బాలన్స్ ఉన్న రీ రికార్డింగ్ పనులను వేగంగా పూర్తి చేసినా సరే పదో తేదీ దాటిపోతుంది. సో జరిగే పని కాదు.
ఒకవేళ సాధ్యమైనా సరే రెండు రోజుల గ్యాప్ లో గుంటూరు కారం వస్తే థియేటర్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుంది. ప్రాథమికంగా నా సామిరంగ తెలుగు రాష్ట్రాల్లో 240 స్క్రీన్లు వచ్చేలా అగ్రిమెంట్లు చేస్తోందట. నాగార్జున రేంజ్ కి ఇది పెద్ద నెంబర్ కాకపోయినా విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంత కన్నా ఎక్కువ ఆశిస్తే కష్టమే. మహేష్ బాబు, వెంకటేష్, రవితేజలతో పాటు తేజ సజ్జ నిర్మాతలు ఎవరికి వారు తమ తమ రేంజ్, నెట్ వర్క్ కు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరూ రాజీపడే పరిస్థితి లేదని పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
చివరిగా రావడం వల్ల నా సామిరంగకు లాభం నష్టం రెండూ ఉన్నాయి. మిగిలిన నాలుగింటి టాక్ ఎలా వస్తుందనేది ఓపెనింగ్స్ ని శాశిస్తుంది. వాటిలో ఏదైనా ఏదైనా యావరేజ్ లేదా డిజాస్టర్ అయితే దాని ప్రయోజనం రెండో వారం నుంచి నా సామిరంగకు షిఫ్ట్ అయిపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం తాకిడి ఎంత లేదన్నా వారం పది రోజులు ఉంటుంది కాబట్టి నాగార్జున మిగిలిన పోటీదారులనే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్న నా సామిరంగలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
This post was last modified on December 25, 2023 4:16 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…