నిన్న బబుల్ గమ్ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో హీరో రోషన్ కనకాల అన్న మాటలు వీడియో రూపంలో మెల్లగా వైరలవుతున్నాయి. తనను నల్లగా ఉన్నాడని వెనక కామెంట్లు చేయడం విన్నానని, చాలా చదివానని, తెరమీద తానేంటో నిరూపించుకుంటానని కుర్రాడు ఒకింత ఆవేశంగా మాట్లాడేశాడు. నిజానికి బబుల్ గమ్ మీద యూత్ అంతో ఇంతో లుక్కేస్తున్నారు కానీ కామన్ ఆడియన్స్ లో దీని గురించి పెద్దగా ఆసక్తి లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాకప్ ఉండటం వల్ల ప్రమోషన్లు ఈ మాత్రం జరుగుతున్నాయి కానీ లేదంటే బజ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. రిలీజ్ కు నాలుగు రోజులే ఉంది.
నిజానికి రోషన్ మీద ఏమంత ట్రోలింగ్ జరగలేదన్నది వాస్తవం. టీవీ యాంకర్ ప్రభాకర్ కొడుకు లాంచ్ ఈవెంట్ చేసినప్పుడు ఆ అబ్బాయి ఓవర్ కాన్ఫిడెన్స్ మీద చర్చ జరిగిన మాట వాస్తవమే కానీ సుమ వారసుడి మీద అంత ఫోకస్ పడలేదు. ఈ కారణంగానే కేవలం అటెన్షన్ కోసం రోషన్ ప్రీ ప్లాన్డ్ గా ఇలా ఆవేశపడ్డాడని నెటిజెన్ల కామెంట్. పైగా విడుదలకు ముందు స్పీచుల్లో ఇంతగా ఎగ్జైట్ అవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఆకాష్ పూరి గతంలో ఇలాగే ఓ ఈవెంట్ లో అన్న మాటలు అతని కొత్త సినిమాకు బజ్ తెస్తాయేమో అనుకుంటే అదేమీ జరగకపోగా బొమ్మ ఫ్లాప్ అయ్యింది.
నిజంగా రోషన్ బాగా చేసి ఉంటే ఎవరు ఆపినా ప్రేక్షకులు ఆదరించే తీరతారు. సినిమా బాగుంటే టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ చేసి పెడతారు. తేడా ఉందంటే మొహమాటం లేకుండా దండం పెడతారు. ఇది ఇప్పటి ట్రెండ్. అంతే తప్ప లేనిపోని ట్రోలింగ్ ని ఊహించేసుకుని ఇలా పబ్లిక్ గా ఉద్వేగపడితే అప్పుడు మొదలవుతుంది అసలు ట్రోల్. 29న కళ్యాణ్ రామ్ డెవిల్ తో పోటీ పడుతున్న బబుల్ గమ్ కు ఇంకో పక్క సలార్ దూకుడు కూడా టెన్షన్ పెట్టేదే. టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ముందు రోజు సాయంత్రమే స్పెషల్ ప్రీమియర్లు వేసేందుకు రెడీ అవుతోంది.
This post was last modified on December 25, 2023 1:09 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…