సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎంతగా శ్రుతి మించి పోతున్నాయో గత కొంత కాలంగా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫేక్ ఐడీలు పెట్టుకుని ఏం పోస్ట్ చేసినా చెల్లిపోతుందని భావిస్తుంటారు చాలామంది. ఒక మనిషి ఎదురు పడితే నోరైనా తెరవలేని వాళ్లు.. ఇక్కడ మాత్రం అదే మనిషిని బూతులు తిట్టేస్తుంటారు. తమ హీరో మీద అభిమానం చూపించడం కంటే కూడా అవతలి హీరోను డీగ్రేడ్ చేసేలా పోస్టులు పెట్టడానికే చాలామంది అభిమానులు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఈ విషయంలో మరీ దిగజారి ప్రవర్తించే అభిమానులకు లెక్క లేదు. ఈ మధ్య తమ హీరోల పుట్టిన రోజులకు ట్రెండ్స్ చేయడాన్ని అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇందులోనూ రికార్డుల కోసం కొట్టేసుకుంటున్నారు. ఈ రికార్డుల్లో కూడా ఏవి నిజమో.. ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి. ఇందుకోసం ఫేక్ ఐడీలతో కూడిన ‘బాట్స్’ కొనుగోలు చేసి ట్వీట్లు వేయించే సంస్కృతి పెరుగుతోంది. అదే సమయంలో అవతలి హీరో అభిమానులు ట్రెండ్ చేస్తుంటే.. దాన్ని డిస్టర్బ్ చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి ఫ్యాన్స్ #HappyBirthdayPaᴡanKalyan హ్యాష్ ట్యాగ్ మీద ట్వీట్లు వేశారు. ఐతే దీన్ని కొంచెం మార్చి #HappyBirthdayPaᴡalaKalyan అని హ్యాష్ ట్యాగ్ పెట్టి యాంటీ ఫ్యాన్స్ దాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు.
ఐతే కొందరు సెలబ్రెటీలతో పాటు పవన్ అభిమానులు కూడా హ్యాష్ ట్యాగ్ కోసం టైప్ చేసినపుడు స్పెల్లింగ్ చూసుకోకుండా యాంటీ ఫ్యాన్స్ పెట్టిందాన్ని ట్యాగ్ చేసి ట్వీట్లు వేశారు. బండ్ల గణేష్ సహా కొందరికి ఇదే ఇబ్బంది ఎదురైంది. గతంలో ఒకసారి ‘కొమరం పులి’ హీరోయిన్ నికీషా పటేల్‌కు ఇదే సమస్య తలెత్తింది. వాళ్లు పొరబాటుగా చూసుకోకుండా చేసిన ట్వీట్లను మళ్లీ యాంటీ ఫ్యాన్స్ రీట్వీట్ చేయడం, కొన్ని వెబ్ సైట్లు దాని గురించి వార్తలు రాయడం. ఈ దురభిమానులకు ఇదేం పైశాచిక ఆనందమో ఏంటో?
This post was last modified on September 2, 2020 9:03 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…