బాక్సాఫీస్ వద్ద సలార్ సునామి మాములుగా లేదు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం రెండు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ 295 కోట్ల 70 లక్షలు కావడం ట్రేడ్ అని ఆశ్చర్యపరుస్తోంది. రెగ్యులర్ ట్రాకింగ్ చేసే పలు వర్గాలు రెండు వందల యాభై కోట్లని చెబుతున్నాయి. దేనికీ ఖచ్చితమైన నిర్ధారణ లేదు కాబట్టి ప్రొడక్షన్ హౌస్ దే పరిగణనలోకి తీసుకోవాలి. లెక్కల సంగతి పక్కనపెడితే వీకెండ్ మొత్తం పూర్తిగా సలార్ ఆధీనంలోనే ఉంది. ఏబీసీ సెంటర్లనే తేడా లేకుండా అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ బోర్డులు పడుతున్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల సులభంగా టికెట్లు దొరికే పరిస్థితి లేదు.
కర్ణాటక, తమిళనాడులో మంచి దూకుడు చూపిస్తున్న సలార్ కేరళలో మోహన్ లాల్ నేరు వల్ల కొంత ప్రభావం చెందింది కానీ ఫైనల్ గా డామినేట్ చేసిన మాట వాస్తవం. ఓవర్సీస్ లో మొదటి వీకెండ్ లోనే అయిదు మిలియన్లు దాటొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ యావరేజ్ టాక్ ఉన్నప్పటికీ పలు దేశాల్లో డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. బాలీవుడ్ వర్గాలు దానికే ఎక్కువ వసూళ్లని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో రియాలిటీ వేరుగా ఉంది. ముంబై మరాఠా మందిర్ లో డంకీ తీసేసి మరీ సలార్ కి మూడు షోలు ఇచ్చేయడం సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ అయ్యింది.
రేపు అఫీషియల్ క్రిస్మస్ సెలవు. శని ఆదివారాలకు ధీటుగా నెంబర్లు నమోదు కాబోతున్నాయి. ఏపీ తెలంగాణలో ఎనభై శాతం దాకా థియేటర్లలో సలార్ మాత్రమే నడుస్తోంది. ముఖ్యంగా బిసి కేంద్రాల్లో ఎక్కడ చూసినా ప్రభాస్ కటవుటే. డంకీ షోలు తగ్గించేయగా, అక్వమెన్ ది ఫాలెన్ కింగ్ డంకి డిజాస్టర్ రిపోర్ట్స్ రావడంతో బయ్యర్లు ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వకుండా వాటిని సలార్ కి కేటాయిస్తున్నారు. స్క్రీన్లు ఎక్కువగా ఉండే చోట మాత్రమే యానిమల్, హాయ్ నాన్నలు కంటిన్యూ అవుతున్నాయి తప్పించి మిగిలిన చోట్ల పూర్తిగా సెలవు తీసేసుకున్నాయి. జనవరి 1 దాకా సలార్ స్పీడ్ కి బ్రేకులు కష్టమే.
This post was last modified on December 24, 2023 2:14 pm
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…
తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్…
అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు…
ఎంపీలకు తమ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ స్థానాల పై పట్టు ఉండడం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి…