సలార్, డంకీ లాంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ వాటికి ధీటుగా నిలబడతామనే నమ్మకంతో మొన్న 21న మలయాళంలో నేరు విడుదల చేశారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామానే అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని గురించి మనకెందకనే పాయింట్ కు వద్దాం. నేరు దర్శకుడు జీతూ జోసెఫ్. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించిన దృశ్యం రూపకర్త. అది సృష్టించిన రికార్డులు కేరళలో ఇప్పటికీ చాలా సెంటర్స్ లో అలాగే ఉన్నాయి.
తెలుగు రీమేక్ మొదటి భాగానికి ఆయన దర్శకత్వం వహించకపోయినా దృశ్యం 2 బాధ్యత ఆయనే తీసుకున్నారు. అప్పటి నుంచే వెంకటేష్ తో మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం మోహన్ లాల్ తోనే దృశ్యం 3 ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వెంకీ ఇక్కడ చేస్తారా లేదానే క్లారిటీ ఇంకా లేదు కానీ నేరు విక్టరీ హీరోకి బాగా సూటవుతుందనే నమ్మకంతో జీతూ జోసెఫ్ స్వయంగా ఓ సారి చూడమని వెంకీని రిక్వెస్ట్ చేశారట. సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వెంకటేష్ తప్పకుండ చూస్తానని మాటిచ్చి తన టీమ్ తో నేరు సక్సెస్ గురించి ఎంక్వయిరీ చేయిస్తున్నట్టు తెలిసింది.
ఒకవేళ నచ్చితే ఈ కాంబోలో తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. నేరు డబ్బింగ్ రైట్స్ ఎవరికీ లేదు. రీమేక్ అయ్యేంత స్ట్రాంగ్ కంటెంట్ కావడంతో హక్కులు నిర్మాణ సంస్థ తమ వద్దనే ఉంచుకుంది. హైదరాబాద్ లో వేసిన పరిమిత షోలు ఫుల్స్ అవ్వడం చూస్తే ఇక్కడి జనాలకు కూడా కనెక్ట్ అవుతోందని అర్థమవుతోంది. ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయరైన హీరో ఎలా సహాయపడ్డాడనే పాయింట్ తో ఇది రూపొందింది. లైన్ సింపుల్ గా అనిపించినా కథనం బిగి సడలకుండా సాగుతుంది. వెంకటేష్ చేస్తే ధర్మచక్రం రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 23, 2023 10:07 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…