నిన్న విడుదలైన సలార్ ఓపెనింగ్స్ ఒక్కసారిగా బాక్సాఫీస్ కి ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. భగవంత్ కేసరి తర్వాత చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్ లేక థియేటర్లు అల్లాడిపోతున్న సమయంలో హౌస్ ఫుల్ బోర్డులతో, టికెట్ల కోసం రికమండేషన్ కాల్స్ తో డిస్ట్రిబ్యూటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే ఊపు ఎన్ని రోజులు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ ప్రభాస్ స్టామినాకు బాలీవుడ్ పండితులు నివ్వెరబోతున్నారు. హిందీ బెల్ట్ లో డంకీ వల్ల ఆశించిన స్థాయిలో స్క్రీన్లు దక్కకపోయినా ఈ రేంజ్ లో ఫిగర్లు నమోదు కావడం చూసి రెబెల్ స్టార్ ని తక్కువంచనా వేయకూడదని అర్థం చేసుకున్నారు.
పలు ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డుని సలార్ తృటిలో మిస్ చేసుకుంది. ట్రేడ్ సమాచారం ప్రకారం ట్రిపులార్ నైజామ్ ఫస్ట్ డే రికార్డు 23 కోట్ల 35 లక్షలతో నమోదైంది. సలార్ కేవలం ఎనభై లక్షల వ్యత్యాసంతో 22 కోట్ల 55 లక్షల దగ్గర ఆగిపోవడం డార్లింగ్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ఒకవేళ డంకీ లేకుండా సోలో రిలీజ్ దక్కి ఉంటే అదనపు థియేటర్లు దొరికి సులభంగా నైజామ్ నెంబర్ వన్ స్థానం దక్కేదనే కామెంట్లో అక్షరం అబద్దం లేదు. ఒక్క క్రాస్ రోడ్స్ లోనే డంకీకి మూడు, హాయ్ నాన్నకు ఒకటి, ఆక్వామెన్ కి రెండు థియేటర్లు కేటాయించడం బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నిన్న వచ్చిన టాక్ తో వీకెండ్ మొత్తం సలార్ కంట్రోల్ లోనే ఉండబోతోంది. షోలు పెంచుతున్నారు. చాలా జిల్లా కేంద్రాల్లో డెబ్భై షోలకు పైగానే ప్లాన్ చేసుకోవడం క్రేజ్ కి నిదర్శనం. మొదటి వారంలోనే క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి కాబట్టి కౌంట్ పెరగడం తప్ప తగ్గడం ఉండదు. ఇక్కడి సంగతి సరే ముంబైలోని ప్రసిద్ధ సింగల్ స్క్రీన్ మరాఠా మందిర్ లో పబ్లిక్ డిమాండ్ కి తలొగ్గి డంకీ షోలు తగ్గించి మరీ సలార్ కి మూడు ఆటలు అదనంగా వేయడం బట్టే చెప్పొచ్చు ఉత్తరాదిలోనూ దేవా వీరంగం మాములుగా లేదని. ఇప్పుడు దీని ఫోకస్ అంతా నాన్ రాజమౌళి రికార్డుల మీదే ఉంది.
This post was last modified on December 23, 2023 9:56 am
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్లో…