జనవరి బాక్సాఫీస్ ని విపరీతంగా వేడెక్కించబోతున్న సంక్రాంతి సినిమాల పంచాయితీలో టాలీవుడ్ పెద్దల మంతనాలు ఇంకా కొలిక్కి రావడం లేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించలేదని ఫిలిం నగర్ టాక్. జనవరి 12 గుంటూరు కారం ఉంది కాబట్టి ఒకరోజు ముందు హనుమాన్ వస్తే ఉభయకుశలోపరిగా ఉంటుందనే ప్రతిపాదన ఫలించలేదట. అలాగే ఎవరో ఒకరు నూతన సంవత్సర కానుకగా ఒకటో తేదీనే తమ సినిమా రిలీజ్ చేస్తే పది రోజుల ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుందనే పాయింట్ కూడా చెల్లలేదట.
దిల్ రాజు, నాగవంశీ, సురేష్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు దీని గురించి ఎంత రాయబారాలు జరుపుతున్నా పని జరగడం లేదని ఇన్ సైడ్ టాక్. ముందు వెనుక జరిగేందుకు ఇష్టపడకుండా అందరూ మొండిపట్టు పట్టేందుకు కారణం ఉంది. అదే థియేటర్ల సమస్య. చాలా కేంద్రాల్లో అయిదు సినిమాలకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో లేవు. మహేష్ బాబు రేంజ్ హీరోకి ఎంత చిన్న సెంటరైనా సరే కనీసం రెండు హాళ్లలో వేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఓవర్ ఫ్లో క్రౌడ్ మిగిలిన సినిమాలకు వెళ్ళిపోతే కలెక్షన్లు పంచుకోవాల్సి ఉంటుంది. దేనికవే విభిన్నంగా అనిపించే జానర్లు కావడం మరో సమస్య.
ఏదున్నా ఈ రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. దానికి అనుగుణంగానే పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగ మాత్రం జనవరి 14 లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. 12 గుంటూరు కారం-హనుమాన్, 13 ఈగల్-సైంధవ్ ప్రస్తుతానికి ఇదే డేట్ల మీద ఉన్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ లు ట్రైలర్ తో పాటు తేదీలను ప్రకటించబోతున్నాయి. ఇవి తమిళంతో పాటు తెలుగులో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి. డబ్బింగ్ సినిమాల విషయంలో ఈసారి కఠినంగా ఉండక తప్పేలా లేదు. ఫైనల్ గా ఎవరు తగ్గుతారో ఎవరు పట్టుమీదే ఉండి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on December 23, 2023 2:48 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…