ఇవాళ డంకీ గురించి ఎక్కువ ఆలోచించి రేపు సలార్ ఎలా చూడాలా అని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ మధ్యలో హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం ఈ రోజే విడుదలైంది. దీని మీద విదేశాల్లో ఏమో కానీ ఇండియాలో ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు. ప్రభాస్ ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాడు కాబట్టి సరిపడా థియేటర్లైతే దొరికాయి కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రివ్యూలు సైతం యావరేజ్ లేదా అంతకంటే తక్కువని చెప్పేశాయి. దీంతో త్రీడి వెర్షన్ లో పిల్లలకు మంచి వినోదాన్ని ఇస్తుందన్న సముద్ర పుత్రుడు పరాభవం చెందేలా ఉన్నాడు.
మాములుగా ఇలాంటి కథల్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. పాత స్టోరీకే రెండు మూడు అదనపు హంగులు జోడించి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఆక్వామెన్ 2లో చివరి అరగంట తప్ప మిగిలిన తొంబై నిముషాలు సాగదీసిన స్క్రీన్ ప్లేతో విసుగు పుట్టించారు. 205 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో ఇది రూపొందింది. గ్రాఫిక్స్ మీద శ్రద్ధ పెట్టారు కానీ అసలైన కంటెంట్ ఎంగేజింగ్ గా ఉందో లేదో చూసుకోలేదు. హీరో జేసన్ మెమో ఫ్యాన్స్ ని నిరాశపరచకపోయినా తెరపై చూపించిన విధానం తేడా కొట్టడంతో ఒకదశ దాటాక నిస్సహాయుడిగా మారిపోయాడు.
లోతైన సముద్రపు అగాథం, చిత్ర విచిత్రమైన జలచరాలు, ఊహల్లో మాత్రమే కనిపించే సరికొత్త ప్రపంచం, నమ్మశక్యం కానీ ఫైట్లు ఇలాంటి హంగులు ఎన్ని ఉన్నా సముద్రపుత్రుడు విసుగు పుట్టకుండా చేయలేకపోయాడు. సో సలార్ కు మొదటి రూటు డంకీ మిక్స్డ్ అండ్ నెగటివ్ టాక్ తో క్లియర్ కాగా ఇప్పుడు రెండో దారి ఆక్వామెన్ రివ్యూలతో స్పష్టమైంది. రేపు ఉదయం కనక ప్రభాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వసూళ్ల సునామి మాములుగా ఉండదు. ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు, షోలు రాబట్టుకున్న ఆక్వామెన్ ఇప్పుడీ ఫలితం చూశాకైనా సలారోడికి అదనంగా కేటాయిస్తాడేమో చూడాలి
This post was last modified on December 21, 2023 7:25 pm
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…
2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…