భారీ అంచనాల మధ్య సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. మళ్లీ బాహుబలి రోజులు గుర్తుకు వస్తున్నాయి జనాలకు. ఈ సినిమా మీద చిత్ర బృందం మొత్తం పూర్తి ధీమాతో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే దర్శకుడు ప్రశాంతిని మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నాడు. అందుకు కారణం సలార్ సినిమా అతడికి నచ్చేయడమేనట.
సినిమా నచ్చితే సక్సెస్ మీద ఇంకా ధీమాగా ఉండాలి కదా టెన్షన్ పడడం ఏంటి అనిపించవచ్చు. కానీ అదే ట్విస్టు అంటున్నాడు ప్రశాంత్. సలార్ ప్రశాంత్ నాలుగో సినిమా కాగా.. ఇంతకు ముందు అతను తీసిన ఉగ్రం, కేజిఎఫ్ -1, కేజీఎఫ్ -2 చిత్రాలను రిలీజ్ ముందు చూసుకున్నప్పుడు అతడికవి అంతగా నచ్చలేదట. ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమాలు విపరీతంగా వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ సలార్ మాత్రం చూసుకుంటే తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారో అని టెన్షన్ పడుతున్నానని ప్రశాంత్.. ప్రభాస్, పృథ్వీరాజ్, రాజమౌళిలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
తొలి 3 సినిమాల అనుభవంతో తనకు ఇకపై ఏ సినిమా కూడా నచ్చకూడదని ఒక మూఢనమ్మకం పెట్టుకున్నానని.. కానీ సలార్ మాత్రం తనకు నచ్చడంతో నెర్వస్ ఫీల్ అవుతున్నానని ప్రశాంత్ తెలిపాడు. ఇక తొలి మూడు సినిమాల్లో ఎక్కువగా ఎలివేషన్లు, యాక్షన్ కట్టాలపై ఆధారపడిన తాను సలార్ లో మాత్రం ఒక బలమైన కథ చెప్పానని… ఇందులో డ్రామా ప్రధానంగా ఉంటుందని, నిజానికి అది తన బలం కాకపోయినా ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని డ్రామా మీద దృష్టి సారించానని.. ఈ విషయంలో రాజమౌళి కూడా తాను స్ఫూర్తిగా తీసుకున్నానని.. ట్రైలర్లో పాత్రలు తప్ప డ్రామా కనిపించలేదని.. కానీ సినిమాలో చాలా డ్రామా ఉంటుందని ప్రశాంత్ పేర్కొన్నాడు.
This post was last modified on December 20, 2023 4:22 pm
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో…
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఎముకలు కొరికే చలిలో సైతం వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష…
పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి…