Movie News

A సర్టిఫికెట్ వెనుక అసలు స్టోరీ

మాములుగా ప్రభాస్ సినిమా అంటేనే పిల్లా పెద్ద తేడా లేకుండా అందరూ చూసేది. అలాంటిది సలార్ కు సెన్సార్ బోర్డ్ అడల్ట్స్ ఒన్లీ A ఇవ్వడం పట్ల అభిమానులు ఒకింత షాక్ కు గురైన మాట వాస్తవం. ఏదో యానిమల్ లాగా పెద్దలు మాత్రమే చూసే సన్నివేశాలు ఉంటే ఏదో అనుకోవచ్చు. కెజిఎఫ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని మెప్పించిన ప్రశాంత్ నీల్ ఇలాంటి కంటెంట్ తీయడనే నమ్మకమే అందరిదీ. దానికి సంబంధించిన క్లారిటీ స్వయంగా ఆయనే ఇచ్చారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో కలిసి రాజమౌళి జాయింట్ గా చేసిన ఇంటర్వ్యూలో A ఎందుకు తీసుకున్నామో వివరించారు

ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి ఇష్టం లేకపోయినా ప్రశాంత్ నీల్ ఓకే చెప్పాడు. కానీ ప్రత్యేకంగా కొన్ని తొలగింపులు మాత్రం కథ వెళ్లే ఫ్లోని దెబ్బ తీస్తాయని భావించి ఏం చేద్దామని ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా ఏ తీసుకోమని చెప్పాడట. అంతే ఇక మరుక్షణం ఆలోచించకుండా కత్తెరింపులు వద్దని చెప్పేశారు. ఫలితంగా యు/ఏ బదులు కేవలం ఏ మాత్రమే వచ్చింది. అయినా దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే యానిమల్ కు ఎనిమిది వందల కోట్లు వచ్చాయంటే కేవలం పెద్దలు చూసినందు వల్ల కాదు.

అయినా మల్టీప్లెక్సులు ఎంత ప్రయత్నించినా సలార్ కు వచ్చే తాకిడిలో ప్రతి ప్రేక్షకుడి వయసు చూసి చెక్ చేసేంత తీరిక, వెసులుబాటు ఉండవు. ఏదో చిన్న పిల్లలను నిలువరించే ప్రయత్నం చేసినా వాళ్ళను తీసుకొచ్చిన పెద్దలతో ఆర్గుమెంట్ తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బాహుబలి, ఆదిపురుష్ హీరో మీద నమ్మకం అలాంటిది. అయినా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏ మాత్రం కాదని స్పష్టంగా చెప్పారు నీల్. రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేవి ఉండవని మరోసారి నొక్కి చెప్పారు.

This post was last modified on December 20, 2023 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

8 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

12 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

13 hours ago