Movie News

అరాచకం అనిపిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సలార్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావడం ఆలస్యం ఆన్ లైన్ యాప్స్ హోరెత్తిపోతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల తర్వాత నైజాం టికెట్లు అందుబాటులో ఉంచిన క్షణాల వ్యవథిలో బుక్ మై షో ఏకంగా క్రాష్ కావడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. నిజానికి ఇలాంటి స్పందన ఊహించే సదరు యాప్ యాజమాన్యాలు తమ సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని సిద్ధంగా ఉంటాయి. కాని దాన్ని మించిన ఊచకోత ప్రభాస్ డిసైడ్ అయినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది. ఇంకా అన్ని థియేటర్లు లిస్ట్ అవుట్ కాలేదు. సగానికి పైగానే అందుబాటులో రావాల్సి ఉంది.

సగటుకు గంటకు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోవడం సలార్ క్రేజ్ కు నిదర్శనం. తెల్లవారుఝాము ఒంటి, నాలుగు గంటల షోల టికెట్లు రెప్పపాటు వ్యవధిలో అయిపోతున్నాయి. మిగిలిన షోల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమి లేదు. ప్రధాన మల్టీప్లెక్సులు, మంచి వసతులున్న సింగల్ స్క్రీన్లలో మూడు లేదా ఆపై రోజే టికెట్లు దొరికే పరిస్థితి నెలకొంది. మైత్రి సంస్థ విన్నూత్నంగా కౌంటర్లలో టికెట్లు అమ్మే సంప్రదాయాన్ని అమలు పరిచారు కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలొచ్చాయి. రద్దీని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు.

ఎల్లుండి ఉదయం సూర్యుడు రాకముందే సలార్ టాక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ట్రెండ్ ఇంకా పైకి వెళ్లడమో లేదో డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే మాత్రం టాక్ తో సంబంధం లేకుండా కనీసం వారం రోజుల పాటు థియేటర్లు హోరెత్తిపోయేలా ఉన్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వంద రూపాయలు అదనంగా ఉన్నా సరే చెల్లించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. పలు చోట్ల మిడ్ నైట్ షో టికెట్ బ్లాక్ లో రెండు నుంచి మూడు వేల రూపాయల దాకా పలుకుతోందట. ఆర్ఆర్ఆర్ తర్వాత దాన్ని మించిన మేనియా సలార్ కు కనిపిస్తోంది

This post was last modified on December 20, 2023 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago