Movie News

జవాన్ కాంబినేషన్ రిపీట్

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి సినిమా ‘రాజా రాణి’తో మొదలుపెడితే.. ‘తెరి’, ‘మెర్శల్’; ‘బిగిల్’ ఇలా తమిళంలో వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడతను. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’ సైతం పెద్ద హిట్ అయింది. అట్లీ ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం.. రొటీన్‌గా ఉందనడం.. వేరే సినిమాలతో పోలికలు పెట్టడం మామూలే. కానీ ఈ కామెంట్లన్నింటినీ దాటుకుని తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకోవడమూ మామూలే.

‘జవాన్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. వరుసగా 5 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అట్లీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేర్వేరు ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఇంతకుముందే అట్లీ సంప్రదింపులు జరిపాడు. తమిళంలో విజయ్‌తో మళ్లీ ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరిగింది. కానీ ఆయా హీరోలకు ఉన్న వేరే కమిట్మెంట్లు అట్లీతో వెంటనే జట్టు కట్టడానికి అవకాశం ఇవ్వట్లేదట. ఈ పరిస్థితుల్లో మళ్లీ షారుఖ్ తోనే సినిమా చేయడానికి అట్లీ రెడీ అయినట్లు సమాచారం.

‘జవాన్’తో తనకు హీరోగా, నిర్మాతగా కోరుకున్నదానికంటే పెద్ద హిట్ ఇవ్వడంతో షారుఖ్.. అట్లీతో ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మళ్లీ తన రెడ్ చిల్లీస్ బ్యానర్లోనే అట్లీతో షారుఖ్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అట్లీ కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాను చేస్తారని.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత అట్లీ.. బన్నీ లేదా తారక్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.

This post was last modified on December 19, 2023 9:42 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

5 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

5 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

7 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago