ఇప్పుడున్న టెక్నాలజీలో హీరో అయినా దర్శకుడైనా సినిమాలకు సంబంధించి మరెవరైనా సోషల్ మీడియాలో ఉండటం అవసరమే. నేరుగా కలిసే అవకాశం లేకపోయినా పైసా ఖర్చు లేకుండా అభిమానులు, మూవీ లవర్స్ తో మాట్లాడి అప్డేట్స్ ఇచ్చే వెసులుబాటు ఇందులోనే ఉంటుంది. నాణేనికి రెండో వైపులా దీనికి మరో పార్శ్యం ఉంది. అదే నెగటివిటీ. నిన్న దర్శకుడు వెంకటేష్ మహా డంకీ టికెట్ ని పోస్ట్ చేసి తన ఆసక్తిని ప్రదర్శించడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. గతంలో కెజిఎఫ్ గురించి తను చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారాయో తెలిసిన విషయమే.
దీంతో ఒక్కసారిగా ఇతని మీద ట్వీట్ల దాడి జరిగిపోయింది. సలార్ టికెట్ షేర్ చేయకుండా అదే పనిగా డంకీ మాత్రమే హైలైట్ చేయడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో వెంకటేష్ మహా చివరికి అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇటీవలే గుంటూరు కారం పాట ఫీడ్ బ్యాక్ గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన హాట్ కామెంట్స్ పట్ల నెటిజెన్ల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ఆయన నాకీ రొంపి వద్దు బాబోయ్ అంటూ సెలవు తీసుకున్నారు. రెండు ట్వీట్లను డిలీట్ చేసిన నిర్మాత నాగవంశీ సైతం ఇబ్బందులు ఎదురుకున్నవాళ్లే.
ఒకరకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఇన్స్ టాలు ఫేక్ ప్రపంచాలు. ఒరిజినల్ ఐడిలతో అకౌంట్లు రన్ చేసే వాళ్ళు మహా అయితే పది ఇరవై శాతం ఉంటారు. మిగిలిన బ్యాచ్ మొత్తం నకిలీ బాపతు. వాళ్ళ పని ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడం, ఏ సెలబ్రిటీ మీదైనా నోరు జారడం. చాలా మంది చూసి చూడనట్టు ఉంటారు. మరికొందరు పర్సనల్ గా తీసుకుని అనవసరంగా టెన్షన్ తెచ్చుకుంటారు. పూరి జగన్నాథ్ సైతం వీటి బారిన పడి సైలెంట్ అయ్యారు. ఆచార్య తర్వాత కొరటాల శివ నో ఆన్ లైన్ అనేశారు. మొహాలు కనిపించని వర్చువల్ వరల్డ్ లో పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి.
This post was last modified on December 19, 2023 4:19 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…