ఎంతసేపూ గుంటూరు కారం పాటల గురించి గొడవ తప్ప మిగిలిన విషయాలు అభిమానులకు అంతగా గుర్తు రావడం లేదు. వాటిలో ప్రధానమైంది హీరోయిన్లు. ఓ మై బేబీ సాంగ్ లో శ్రీలీలని రివీల్ చేశారు. మహేష్ బాబు వెంటపడుతూ తనను ఎంతగా ప్రేమిస్తోందో చెప్పించారు. ఫీడ్ బ్యాక్ సంగతి పక్కనపెడితే ఈ అమ్మాయే అసలు జోడని అర్థమైపోయింది. అయితే మీనాక్షి చౌదరి కూడా ఉన్న సంగతి మర్చిపోకూడదు. పూజా హెగ్డేని తప్పించి ఆ స్థానంలో శ్రీలీలని పెట్టి రెండో కథానాయికగా హిట్ భామని ఎంచుకున్న త్రివిక్రమ్ ఎందుకనో బయట చూపించకుండా దాచి పెడుతున్నారు .
బాగా గమనించి చూస్తే మీనాక్షి చౌదరికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు లేరు. ఉన్నదే నాలుగు పాటలు. వాటిలో రెండు డ్యూయెట్లు. శ్రీలీలతోనే ఉంటాయని ఇన్ సైడ్ టాక్. మరొకటి స్పెషల్ సాంగ్. బయటి హీరోయిన్ లేదా మొత్తం ఆర్టిస్టుల మీద పెళ్లి పాట తరహాలో చిత్రీకరిస్తారని టాక్ ఉంది కానీ నిర్ధారణగా ఇంకా తెలియడం లేదు. మరొకటి గుంటూరు కారం టైటిల్ ట్రాక్. దీంట్లో మహేష్ తప్ప ఇంకెవరూ కనిపించేందుకు చోటు ఉండదు. అలాంటపుడు మీనాక్షికి తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందనే వార్తకు బలం చేకూరినట్టు అవుతోంది. ట్రైలర్ చూశాక క్లారిటీ రావొచ్చు.
గుంటూరు కారం మీద శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇద్దరికీ బోలెడు ఆశలున్నాయి. ఒకరేమో చేతి నిండా సినిమాలతో టాప్ డిమాండ్ అనుభవిస్తున్నా హ్యాట్రిక్ డిజాస్టర్లతో డేంజర్ జోన్ లో పడింది. మరొకరేమో స్టార్ హీరో సినిమాలో భాగమై బ్రేక్ దక్కితే వరసగా అవకాశాలు వస్తాయనే నమ్మకం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో మాములుగా సెకండ్ హీరోయిన్లు మరీ ఎక్కువగా హైలైట్ అవ్వరు. నివేత పేతురాజ్, అనుపమ పరమేశ్వరన్, ఈషా రెబ్బ, అను ఇమ్మానియేల్ ఈ లిస్టులో ఎవరికీ అనూహ్యమైన బ్రేక్ దక్కలేదు. మరి మీనాక్షి చౌదరికైనా ఏమైనా మేజిక్ జరుగుతుందేమో చూడాలి.