ఒక ట్రైలర్ వచ్చాక రెండో వెర్షన్ కోసం అంతకన్నా విపరీతమైన ఉత్సుకతతో ఎదురు చూడటం సలార్ విషయంలోనే జరిగింది. డిసెంబర్ 22 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ నుంచి మరిన్ని విజువల్స్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారో చెప్పడం కష్టం. ఒకే రోజు రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ ఫైనల్ గా హోంబాలే ఫిలిమ్స్ సలార్ ట్రైలర్ 2ని రిలీజ్ చేసింది. కథేంటో ముందే చెప్పేశారు కాబట్టి ఇందులో ఫోకస్ మొత్తం ఫైట్ల మీదే ఉంది. దానికి తగ్గట్టే మరికొన్ని డీటెయిల్స్ ని పొందుపరుస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ విధ్వంసాన్ని ఆవిష్కరించారు.
ఖన్సార్ నగరాన్ని గుప్పిట్లో ఉంచుకున్న మన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్) కు శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ఎంత పెద్ద సైన్యం ఉన్నా తెగించి పోరాడేందుకు సరిపడా సత్తువా, ధైర్యం వాళ్లలో ఉండదు. అప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు దేవా(ప్రభాస్)ని పిలిపిస్తాడు మన్నార్. గన్ను, కత్తి, సుత్తి ఏ ఆయుధం పట్టుకున్నా ముందు వెనుక చూడకుండా నరమేథం చేసే ఇతన్ని స్నేహం పట్ల పిచ్చి ఉన్నోడిగా మన్నార్ నమ్మకాన్ని దేవా నిలబెట్టుకుంటాడు. అయితే ఇదంతా ఒకవైపే. ఇద్దరు శత్రువులుగా మారే తరుణం వస్తుంది. అదే సలార్ లో చూడాల్సిన అసలు కథ.
విజువల్స్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ నెత్తురు, బులెట్లతో నింపేశాడు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎక్కువగా చూపించి అభిమానులను సంతృప్తి పరిచాడు. ముఖ్యంగా భారీ యుద్ధ ట్యాంకర్లు, వాహనాలు, భీతి గొలిపే వందలాది రౌడీ మూకలతో దేవా చేసే పోరాటాలు ఒకటేమిటి గూస్ బంప్స్ స్టఫ్ ని పూర్తిగా ట్రైలర్ 2లో జొప్పించారు. బాబీ సింహా, శ్రేయ రెడ్డి, జగపతిబాబు తదితరులను గతంలో కన్నా ఎక్కువగా రివీల్ చేశారు. మొత్తానికి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఖచ్చితంగా డిమాండ్ చేసే స్థాయిలో సలార్ ఉందనే నమ్మకాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఈ అంచనా నిలబెట్టుకుంటే వసూళ్ల ఊచకోతే
This post was last modified on December 18, 2023 4:29 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…