స్టార్ హీరోల సినిమాల విషయంలో అభిమానులు ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఉంటారో తెలియంది కాదు. వాళ్ళ ఎమోషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. ఇటీవలే గుంటూరు కారం పాట గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో చూసాం. నిర్మాత పెట్టిన ట్వీట్స్ ని డిలీట్ చేసే దాకా పరిస్థితి వెళ్ళింది. అప్డేట్ల గురించి వాళ్ళ ఉద్వేగాన్ని అర్థం చేసుకోవాల్సిందే. పోస్టరైనా చిన్న వీడియో బిట్ అయినా ఏదైనా సరే ఫలానా డేట్ టైంకి వదులుతామంటే పనులన్నీ మానుకుని ఆ సమయానికి యూట్యూబ్, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు లక్షలు కోట్లలో ఉంటారు. వాళ్ళను సంతృప్తిపరిచే విషయంలో రాజీ ఉండకూడదు.
కానీ సలార్ నిర్మాతలు మాత్రం ఫ్యాన్స్ సహనానికి పెద్ద పరీక్షే పెడుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు యాక్షన్ ట్రయిలర్ కొత్తగా రిలీజ్ చేస్తామని మొన్నే ప్రకటించారు. తీరా రిమైండర్లు పెట్టుకుని మరీ వెయిట్ చేస్తే తూచ్ మధ్యాన్నం 2 గంటలకు పోస్ట్ పోన్ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. సరే ఏదో ఒత్తిడిలో ఉన్నారు లెమ్మని డార్లింగ్ అభిమానులు సర్దిచెప్పుకుని తిరిగి ఆ టైంకి ఎదురు చూడసాగారు. కట్ చేస్తే మళ్ళీ ఉలుకు పలుకు లేదు. ముంబైలో 120 అడుగుల కటవుట్ వీడియో పెట్టిన హోంబాలే మేకర్స్ ట్రైలర్ తిరిగి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
ఇంకాసేపట్లో రావొచ్చు లేదా ఇంకా లేట్ అవ్వొచ్చు. అది కాదు అసలు సమస్య. లక్షలాది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారని తెలిసినప్పుడు ముందుగా ప్లాన్ చేసుకోవడం అవసరం. సాంకేతికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందే గుర్తించి దానికి అనుగుణంగా సిద్ధపడాలి. అంతే తప్ప వెయిటింగ్ గేమ్ ఆడించినంత మాత్రాన అదో పెద్ద కిక్ ఇస్తుందని భ్రమ పడితే అంతే సంగతులు. జక్కన్నతో చేయించిన ఇంటర్వ్యూకి సైతం ప్రోమో కి గ్లిమ్ప్స్ వదిలి మళ్ళీ ఫుల్ వీడియో రెండు రోజుల తర్వాత వదులుతామని చెప్పడం కూడా కాసింత అసహనాన్ని కలిగించింది. ట్రైలర్ అదిరిపోతే అదే పదివేలు.
This post was last modified on December 18, 2023 3:48 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…