రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీజన్ విజేతను వెల్లడించే రోజున.. భారీగా అభిమానులు షూటింగ్ జరిగే అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. విజేతగా యూట్యూబర్ కమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నట్లుగా ప్రకటించటం.. రన్నరప్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ నిలవటంతో వారిద్దరి అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఈ ఇద్దరి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరారు. విజేత వివరాలు తెలిసినంతనే పల్లవి ప్రశాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం చూస్తుండగానే చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. ఒకరినొకరు తోసుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. బూతులు తిట్టుకుంటున్న వారు.. మరింతగా చెలరేగిపోయి.. ఆ టైంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు (కొండాపూర్ – సికింద్రాబాద్) అద్దాల్ని పగలగొట్టారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చిన అమర్ దీప్ వాహనాన్ని చుట్టుముట్టి.. ముందుకు కదలకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో.. కారులో ఉన్న అమర్ దీప్ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నెలకొన్న అలజడి గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దారు. దాడులకు దిగిన ఇరు వర్గాల్ని చెదరగొట్టారు.
ప్రశాంత్ – అమర్ అభిమానుల మధ్య నెలొకన్న గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇరువురు అభిమానుల తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆటను ఆటలా చూడాలే కానీ.. మరీ ఈ అతి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్న వేళలో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఎందుకు లేరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక రియాల్టీ షో ఫైనల్ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేసే వరకు వెళ్లటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on %s = human-readable time difference 10:27 am
తండేల్.. టాలీవుడ్లో తెరకెక్కుతున్న ఆసక్తికర చిత్రాల్లో ఇదొకటి. కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా చర్చే…
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…