Movie News

బిగ్ బాస్ ఫినాలే ప్రభావం – ఇంద్ర ఆలస్యం

అదేంటి బిగ్ బాస్ షోకి ఇంద్ర సినిమాకు కనెక్షన్ ఏంటని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా పేరున్న ఇంద్ర శాటిలైట్ ఛానల్స్ లో రాక ఏళ్ళు గడిచిపోయాయి. 2014లో చివరి సారి జెమినిలో ప్రసారమయ్యాక హక్కుల రెన్యూవల్ దగ్గర ఏదో సమస్య వచ్చి నిర్మాత అశ్వినీదత్ రైట్స్ తన దగ్గరే ఉంచుకున్నారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా సరే సరైన క్వాలిటీ ప్రింట్ తో చూడలేకపోతున్నామనే బాధ ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చింది. ఫైనల్ గా బుల్లి తెర ఇంద్ర ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది.

ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే డిసెంబర్ 17 సాయంత్రం వేద్దామని అనుకున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో లీకులు వదిలారు. ఫ్యాన్స్ కూడా హంగామా చేశారు. తీరా చూస్తే ఇప్పుడిది రావడం లేదు. కారణం ఏంటంటే బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ అదే సమయంలో ఉండటంతో రేటింగ్స్ మీద ప్రభావం పడుతుందని నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి 24న సలార్ హడావిడి ఉంటుంది కాబట్టి అది కూడా వదిలేసి ఫైనల్ గా డిసెంబర్ 30 ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత టెలికాస్ట్ కాబట్టి ప్రమోషన్లు భారీగా చేయాలని ప్లాన్ చేశారట.

దీన్ని బట్టే బిగ్ బాస్ షో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజేత పల్లవి ప్రశాంత్ అని ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది. మహేష్ బాబు అతిథిగా వస్తున్నాడనే వార్తలో నిజం లేదని లేటెస్ట్ అప్డేట్. గుంటూరు కారం టీమ్ నుంచి శ్రీలీల ఒకటే రావొచ్చు. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏమి లేదు. ఒక టీవీ షో కోసం సినిమా ప్రీమియర్ ని మార్చుకోవడం అరుదే. నిజానికి ఇంద్రని థియేట్రికల్ రీ రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ వైజయంతి మూవీస్ వచ్చే ఏడాది సంస్థ యాభై వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉందని టాక్.

This post was last modified on December 17, 2023 4:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీ నేత అరెస్ట్… సీఎం బాబు రియాక్షన్ ఇదే!

సాధార‌ణంగా ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీకి చెందిన నాయ‌కుల‌కు స‌ర్కారు నుంచి అభ‌యం ఉంటుంది. ఇది స‌హ‌జం. ఎక్క‌డైనా ఎవ‌రైనా త‌ప్పులు…

3 minutes ago

యువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకు

గ్రౌండ్‌లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ 'స్వాగ్'…

25 minutes ago

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల…

32 minutes ago

పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల…

1 hour ago

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

2 hours ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

2 hours ago