పుష్ప సినిమా ద్వారా గుర్తింపు పొందిన నటుడు కేశవ అలియాస్ జగదీష్, అలియాస్ బండారు ప్రతాప్.. తాజాగా ఓ యువతి ఆత్మహత్య, ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వేధించిన కేసులో అరెస్టయి.. జైలు పాలైన విషయం తెలిసిందే. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో కేశవ విచారించారు.ఈ సందర్భంగా పోలీసులకే కేశవం సంచలన విషయాలు వెల్లడించాడు.
ఇలా మొదలైంది..
సినీ అవకాశాల కోసం హైదరాబాద్‌కి వచ్చిన కేశవకు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతను మారిపోయాడు. ఆమె ఉండగానే మరొకరిని రూమ్‌కు తెచ్చుకునేవాడు. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది.
ఈ విషయం తెలుసుకున్న కేశవ ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సెక్స్‌లో ఉండటం చూసి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ముందు తనకు ఏమీ తెలియదని బుకాయించినా.. పోలీసుల శైలిని రుచిచూశాక.. నేరాన్ని అంగీకరించాడు. ఇక, కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.
This post was last modified on December 17, 2023 2:14 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…