బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ విడుదలై రెండు వారాలు దాటేసి ఎనిమిది వందల కోట్ల వైపుగా పరుగులు పెడుతోంది. వెయ్యి మార్కు అనుమానంగానే ఉన్నా భారీ ఫిగర్లు ట్రేడ్ మతులు పోగొడుతున్నాయి. అలాగే ఇందులో ఉన్న కంటెంట్ మీద వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా, మరో వర్గం అతని ఆలోచనలను వ్యతిరేకించే దిశగా ఎవరి వెర్షన్లు వాళ్ళు వినిపిస్తూనే ఉన్నారు. క్రిటిక్స్ వాదనలు ముందు నుంచి ఉంటూనే వచ్చాయి. తాజాగా ఛాయాగ్రాహకుడు సిద్దార్థ నుని చేసిన ఇన్స్ టా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముందు అతనేమన్నాడో చూద్దాం.
నిన్న యానిమల్ చూశా. అల్ఫా మేల్ పేరుతో విచ్చలవిడి హింస, రక్తపాతాన్ని ప్రోత్సహించడం ఆశ్చర్యపరిచింది. అసలు చట్టమనదే లేనట్టు, మృగవాంఛ తరహాలో కట్టుకున్న భార్య మీద కూడా బలవంతపు శృంగారానికి తెగబడటం, మొగుడు ఎంత బరితెగింపుగా ప్రవర్తిస్తున్నా భరిస్తున్నట్టు చూపించడం ఆమోదయోగ్యంగా లేదు. చివరి షాట్ రన్బీర్ కపూర్ చేసిన అసభ్యకరమైన శరీరబాష ద్వారా ఏం సంకేతం ఇస్తుందో అర్థం కాలేదు. అడల్ట్స్ ఓన్లీ అన్నారు కానీ హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్సుల్లో పద్దెనిమిది దాటని టీనేజర్లను అనుమతించడం కళ్లారా చూశాను. దీన్ని అడ్డుకోవడం సాధ్యమా.
దీనికి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయంటే ఇదంతా ఆమోదిస్తున్న ప్రపంచంలో మనం ఉంటున్నామా. ఇదండీ సిద్దార్థ్ చేసిన కామెంట్స్. సరే యానిమల్ ప్రభావం ఎలాంటిదో కాసేపు పక్కనపెడితే ఈయనే పని చేసిన బ్రహ్మన్ నామన్ అనే ఇంగ్లీష్ మూవీలో హీరో ఇంట్రోనే ఓవర్ అడల్ట్రీగా ఉంటుంది. మరి అది ప్రభావం చూపిస్తుందని అనుకోలేదాని ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా యానిమల్ ని ఆడియన్స్ భారీ ఎత్తున స్వీకరించారు. ఇది కాదనలేని వాస్తవం. ప్రజాస్వామ్యంలో సిద్దార్థ లాగా విభేదించడంలో తప్పేం లేదు. పైగా ఆలోచించాల్సిన పాయింట్లు కూడా ఉన్నాయి.
This post was last modified on December 14, 2023 12:04 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…