నిన్న సాయంత్రం గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ లిరికల్ వీడియో రిలీజ్ కావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో పాట మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఓ రేంజ్ లో సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది. విచిత్రంగా మహేష్ బాబు అభిమానులే అధికశాతం ఈ ట్రెండ్స్ లో పాలు పంచుకోవడం ట్విస్టు. ఇది మితిమీరిన అంచనాల వల్ల జరిగిందా లేక నిజంగా అవుట్ ఫుట్ తేడా కొట్టిందానే విశ్లేషణలో టీమ్ బిజీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మీద కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఇంకా చిత్రీకరణలో ఉన్న పాట కాబట్టి విజువల్స్ గురించి ఏమంత పెద్ద చర్చ జరగలేదు.
ఇంతగా ఈ టాపిక్ వైరల్ కావడానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. సర్కారు వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. కళావతి మినహాయించి మిగిలిన సాంగ్స్ అంతగా క్లిక్ కాకపోవడం వాస్తవమే. మహేష్, సితార కలిసి డాన్స్ చేసిన పెన్ని సాంగ్ సైతం నిరాశపరిచింది. ఇక సినిమాలో కీలకమైన బీచ్ ఫైట్ కి కొట్టిన బీజీఎమ్ దాని స్థాయిని తగ్గించిందనేది అప్పట్లోనే అభిమానులు కంప్లయింట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ బ్యాంకులో తాళాల గుత్తి పట్టుకునే ఫైట్ లోనూ ఇదే జరిగిందని వాళ్ళ ఫీలింగ్. అక్కడ మొదలైన ఈ అసంతృప్తి పర్వం ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
అసలు గుంటూరు కారం ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం రెండు పాటలను పట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ పనితనం మీద ఇంత దాడి చేయాలా అనేది తమన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. దం మసాలా బిర్యానీని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఓ మై బేబీ మీద ఇంత ఎదురు దాడి ఎందుకని అడుగుతున్నారు. ఇంకో రెండు బ్యాలన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అవి వస్తాయి. అసలైన ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు కానీ ఇంత నెగటివిటీ తొందరపాటేనని కొందరు నెటిజెన్ల వెర్షన్. ఏది ఏమైనా తమన్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రోలింగ్ బారిన పడ్డాడు. దానికి సమాధానం చెప్పాల్సింది గుంటూరు కారం స్కోర్ తోనే.
This post was last modified on December 14, 2023 10:44 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…