నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘డెవిల్’ క్రెడిట్ విషయంలో కొన్ని నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది. కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ సినిమా రిలీజ్ సమయానికేమో నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. ఇప్పటిదాకా రైటింగ్, డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేని నిర్మాత.. ఉన్నట్లుండి ఎలా దర్శకుడు అయిపోయాడో జనాలకు అర్థం కావడం లేదు. దర్శకుడితో నిర్మాతకు విభేదాలు తలెత్తితే.. అతణ్ని తప్పించి మరొకరిని పెట్టిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడు అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
టీజర్ లాంచ్ అయినప్పుడు దర్శకుడిగా నవీన్ పేరు తీసేసినప్పటికీ టెక్నికల్ టీంలో తన పేరు ఉంది. కానీ తర్వాత పూర్తిగా ఆ పేరును ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. మొన్నటిదాకా ఈ ప్రాజెక్టులో ఏ మాత్రం భాగస్వామ్యం లేని శ్రీకాంత్ విస్సా ఇప్పుడు స్క్రిప్ట్ క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు. అతడికే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు ట్రైలర్లో. మరి మొదట్లో అభిషేక్ పిక్చర్స్ టీంతో కలిసి నవీన్ తయారు చేసిన స్క్రిప్టును పూర్తిగా పక్కన పెట్టారా లేక శ్రీకాంత్ దానికే మెరుగులు దిద్దాడా అన్నది తెలియదు.
మొత్తానికి డెవిల్ రైటింగ్, డైరెక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. టైలర్ చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుండగా.. అంత కంటే ముందు ఈ పరిణామాలు ప్రేక్షకులకు ఎక్కువ థ్రిల్ కలిగిస్తున్నాయి. డెవిల్ టీం దర్శకుడి మార్పు విషయమై ఎవరు మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తుండడం విశేషం. చివరికి నవీన్ సైతం ఈ వివాదంపై సైలెంట్ గానే ఉండడం.. తన ట్విట్టర్ అకౌంట్లో డెవిల్ కు సంబంధించిన పోస్టులన్నీ అలాగే కొనసాగిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 12:26 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…