కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో కంటెంట్ పరంగా సెన్సేషన్ అంటే మంగళవారం చిత్రమే. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టి ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అజయ్ భూపతి ఒక డిఫరెంట్, బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆర్ఎక్స్ 100 తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచిన అజయ్.. మంగళవారం మూవీతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అయితే భూపతికి మంచి అవకాశాలే వస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. పాయల్ పరిస్థితే ఆశాజనకంగా కనిపించడం లేదు.
మంగళవారం మూవీలో శైలు పాత్రను పాయల్ రాజ్‌పుత్ గొప్పగా పోషించింది. ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు బెంబేలెత్తిపోతారు. కన్విన్సింగ్‌గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడం అంత తేలిక కాదు. పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్‌తో మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఎంతో రిస్క్ చేసి ఈ పాత్రలో బోల్డ్ అండ్ స్టనింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాయల్.. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశించింది.
కానీ పాయల్ కు పెద్దగా అవకాశాలు వస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదు. మంగళవారం రిలీజ్ తర్వాత ఆమె గురించి పెద్దగా డిస్కషన్లు కూడా లేవు. తాను కోరుకున్నట్లుగా రాకపోవడంతో కాంతార చాప్టర్-1లో ఛాన్స్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసి.. ఓపెన్ గా సోషల్ మీడియాలో దర్శకుడు రిషబ్ శెట్టికి ఆమె రిక్వెస్ట్ పెట్టింది. ఇది ఆమె డెస్పరేషన్ ను సూచించేదే. అయితే ఎలా ప్రయత్నిస్తేనేమి పాయల్ కు ఏదో ఒక ఛాన్స్ వస్తుందేమో ఏమో చూడాలి.
This post was last modified on December 13, 2023 11:14 am
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…