జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర టీజర్ వచ్చే వారం విడుదలవుతుందనే ప్రచారం అభిమానులతో పాటు సోషల్ మీడియాలో గట్టిగానే జరిగింది. కానీ ఆదేది నిజం కాదు. అసలా వీడియోనే ఇంకా పూర్తి స్థాయిలో ఎడిట్ చేయలేదని యూనిట్ వర్గాల సమాచారం. కళ్యాణ్ రామ్ డెవిల్ ఈ నెల 29 విడుదల కాబోతున్న నేపథ్యంలో అప్పటిదాకా దాని గురించి బజ్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంలో దేవరని మధ్యలో తీసుకొచ్చి డైవర్ట్ చేయకూడాదని నిర్ణయం తీసుకున్నట్టు వినికిడి. అయితే ఎప్పుడొస్తుందనే టెన్షన్ ఫ్యాన్స్ కి అక్కర్లేదు.
సంక్రాంతికి దేవర టీజర్ రావడం లాంఛనమే. డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు కానీ సినిమా రిలీజులు ఎక్కువగా ఉండటం వల్ల సరైన తేదీ, సమయం రెండూ చూసుకుని ఇండియా వైడ్ హైప్ వచ్చేలా దానికి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారు. చిన్న టీజరే అయినప్పటికీ అంచనాలను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. జాన్వీ కపూర్ ని రివీల్ చేయడం లాంటివి ఉండవు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసి సముద్రపు బ్యాక్ డ్రాప్ లో దేవర ప్రపంచం ఎలా ఉండబోతోందనే ఇంట్రో దాని ద్వారా చూపించబోతున్నారు.
ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవరకు జనవరితో మొదలుపెట్టి కేవలం మూడు నెలలు టైం మాత్రమే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అనే ప్రశ్నే తలెత్తకుండా పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగవంతం చేశారు. దేవర రెండో భాగం కూడా ఉంది కాబట్టి దాని తాలూకు షెడ్యూల్స్ ని వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు. స్క్రిప్ట్ రెడీగానే ఉందట. సీక్వెల్ కి అన్నిరకాలుగా స్కోప్ ఉన్న సబ్జెక్టు కావడంతోనే కొన్ని నెలల క్రితమే పార్ట్ 2 చేయాలని టీమ్ డిసైడ్ చేసుకుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
This post was last modified on December 12, 2023 3:19 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…